ఆశపడు చున్నాను
కీర్తనల గ్రంథము 119:81

(కఫ్‌) నీ రక్షణకొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యముమీద ఆశపెట్టుకొనియున్నాను

కీర్తనల గ్రంథము 119:166

యెహోవా, నీ రక్షణకొరకు నేను కనిపెట్టుచున్నాను నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను.

ఆదికాండము 49:18

యెహోవా, నీ రక్షణకొరకు కనిపెట్టి యున్నాను.

2 సమూయేలు 23:5

నా సంతతివారు దేవుని దృష్టికి అనుకూలులే గదా ఆయన నాతో నిత్యనిబంధన చేసియున్నాడు ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే అది స్థిరమాయెను, దేవునికి పూర్ణానుకూలము అది నాకనుగ్రహింపబడిన రక్షణార్థమైనది నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును.

సామెతలు 13:12

కోరిక సఫలము కాకుండుటచేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము.

పరమగీతములు 5:8

యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడినయెడల ప్రేమాతిశయముచేత నీ ప్రియురాలు మూర్ఛిల్లెనని మీరతనికి తెలియజేయునట్లు నేను మీచేత ప్రమాణము చేయించుకొందును.

రోమీయులకు 7:22-25
22

అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రము నందు నేను ఆనందించుచున్నాను గాని

23

వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో నున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరచుకొనుచున్నది.

24

అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును?

25

మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును, శరీర విషయములో పాప నియమమునకును దాసుడనై యున్నాను.

రోమీయులకు 8:23-25
23

అంతే కాదు, ఆత్మయొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడ దత్త పుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనముకొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము

24

ఏలయనగా మనము నిరీక్షణ కలిగినవారమై రక్షింపబడితివిు. నిరీక్షింపబడునది కనబడునప్పుడు, నిరీక్షణతో పనియుండదు ; తాను చూచుచున్న దానికొరకు ఎవడు నిరీక్షించును?

25

మనము చూడని దాని కొరకు నిరీక్షించిన యెడల ఓపికతో దానికొరకు కనిపెట్టుదుము.

ఫిలిప్పీయులకు 1:23

ఈ రెంటి మధ్యను ఇరుకునబడియున్నాను. నేను వెడలిపోయి క్రీస్తు తో కూడ నుండవలెనని నాకు ఆశ యున్నది, అదినాకు మరి మేలు.

నీ ధర్మశాస్త్రము
కీర్తనల గ్రంథము 119:16

నీ కట్టడలనుబట్టి నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరువకయుందును.

కీర్తనల గ్రంథము 119:24

నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తలైయున్నవి.

కీర్తనల గ్రంథము 119:47

నీ ఆజ్ఞలనుబట్టి నేను హర్షించెదను అవి నాకు ప్రియములు.

కీర్తనల గ్రంథము 119:77

నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రదుకునట్లు నీ కరుణాకటాక్షములు నాకు కలుగును గాక.

కీర్తనల గ్రంథము 119:111

నీ శాసనములు నాకు హృదయానందకరములు అవి నాకు నిత్యస్వాస్థ్యమని భావించుచున్నాను.

కీర్తనల గ్రంథము 119:162

విస్తారమైన దోపుసొమ్ము సంపాదించినవానివలె నీవిచ్చిన మాటనుబట్టి నేను సంతోషించుచున్నాను.

కీర్తనల గ్రంథము 119:167

నేను నీ శాసనములనుబట్టి ప్రవర్తించుచున్నాను అవి నాకు అతి ప్రియములు,

కీర్తనల గ్రంథము 1:2

యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.