రప్పింతును
1 సమూయేలు 2:27-36
27

అంతట దైవజను డొకడు ఏలీ యొద్దకు వచ్చి యిట్లనెను యెహోవా నిన్నుగూర్చి సెలవిచ్చినదేమనగా , నీ పితరుని యింటివారు ఐగుప్తు దేశమందు ఫరో యింటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని .

28

అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠము మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగునట్లు ఇశ్రాయేలు గోత్రము లలోనుండి నే నతని ఏర్పరచుకొంటిని . ఇశ్రాయేలీయులు అర్పించిన హోమ వస్తువులన్నిటిని నీ పితరుని యింటివారి కిచ్చితిని .

29

నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేల తృణీకరించుచున్నారు ? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులగు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠభాగములను పట్టుకొనుచు, నాకంటె నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు.

30

నీ యింటివారును నీ పితరుని యింటివారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదు రని యెహోవా ఆజ్ఞ యిచ్చియున్నను ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయె నని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు . కావున యెహోవా వాక్కు ఏదనగా-నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును . నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు .

31

ఆలకించుము ; రాగల దినములలో నీ బలమును నీ పితరుని యింటి బలమును నేను తక్కువచేతును . నీ యింట ముసలివాడు ఒకడును లేకపోవును .

32

యెహోవా ఇశ్రాయేలీయులకు చేయదలచిన మేలువిషయములో నా నివాసస్థలమునకు అపాయము కలుగగా నీవు చూతువు . ఎప్పటికిని నీ యింట ముసలివాడు ఉం డడు .

33

నా బలిపీఠము నొద్ద నెవడు ఉండకుండ నేనందరిని నశింప జేయక విడుచువాడను గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖముచేత క్షయమగుటకును సాధనమగును; నీ సంతానపు వారందరు వయఃకాలమందు మరణమవుదురు .

34

నీ యిద్దరు కుమారులైన హొఫ్నీకిని ఫీనెహాసునకును సంభవించునని నేను చెప్పినదానికి నీకు సూచనగా నుండును.ఒక్క నాటియందే వారిద్దరు మరణమవుదురు .

35

తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును ; అతడు నా యోచననుబట్టి నా కనుకూలముగా యాజకత్వము జరిగించును , అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టింతును , అతడు నా అభిషిక్తుని సన్నిధిని ఎప్పటికిని యాజకత్వము జరిగించును .

36

అయితే నీ యింటివారిలో శేషించినవారు ఒక వెండి రూకనైనను రొట్టె ముక్కనైనను సంపాదించుకొనవలెనని అతనియొద్దకు వచ్చి దండముపెట్టి –నేను రొట్టె ముక్క తినునట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగములలో ఒక దానియందు నన్ను ఉంచుమని అతని వేడుకొందురు .

సంఖ్యాకాండము 23:19

దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా?

యెహొషువ 23:15

అయితే మీ దేవుడైన యెహోవా మీతో చెప్పిన మేలంతయు మీకు కలిగిన ప్రకారము మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన యీ మంచి దేశములో ఉండకుండ ఆయన మిమ్ము నశింపజేయువరకు యెహోవా మీ మీదికి కీడంతయు రాజేయును.

జెకర్యా 1:6

అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలును కట్టడలును మీ పితరుల విషయములో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి-మన ప్రవర్తననుబట్టియు క్రియలనుబట్టియు యెహోవా మనకు చేయదలచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసియున్నాడని చెప్పుకొనిరి.

లూకా 21:33

ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలేమాత్రమును గతిం పవు .