the lords
1 సమూయేలు 29:6

కాబట్టి ఆకీషు దావీదును పిలిచి -యెహోవా జీవము తోడు నీవు నిజముగా యథార్థపరుడవై యున్నావు; దండులో నీవు నాతోకూడ సంచరించుట నా దృష్టికి అనుకూలమే ;నీవు నాయొద్దకు వచ్చిన దినమునుండి నేటి వరకు నీయందు ఏ దోషమును నాకు కనబడ లేదుగాని సర్దారులు నీయందు ఇష్టము లేక యున్నారు.

1 సమూయేలు 29:7

ఫిలిష్తీయుల సర్దారుల దృష్టికి నీవు ప్రతికూలమైన దాని చేయకుండునట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్లుమని చెప్పగా

1 సమూయేలు 5:8-11
8

ఫిలిష్తీయుల సర్దారు లందరిని పిలువ నంపించి -ఇశ్రాయేలీయుల దేవుని మందసమును మనము ఏమి చేయుదుమని అడిగిరి . అందుకు వారు-ఇశ్రాయేలీయుల దేవుని మందసమును ఇక్కడనుండి గాతు పట్టణమునకు పంపుడని చెప్పగా , జనులు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును అక్కడనుండి గాతునకు మోసికొని పోయిరి.

9

అయితే వారు అష్డోదునుండి గాతునకు దానిని మోసికొనిపోయిన తరువాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకు రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి , గొప్ప నాశనము జేసెను .

10

వారు దేవుని మందసమును ఎక్రోనునకు పంపివేయగా దేవుని మందసము ఎక్రోను లోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి-మనలను మన జనులను చంపివేయవలెనని వీరు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును మన యొద్దకు తీసికొని వచ్చిరనిరి.

11

కాగా జనులు ఫిలిష్తీయుల సర్దారు లనందరి పిలువనంపించి -ఇశ్రాయేలీయుల దేవుని మందసము మనలను మన జనులను చంప కుండునట్లు స్వస్థానమునకు దానిని పంపించు డనిరి . దేవుని హస్తము అక్కడ బహు భారముగా ఉండెను గనుక మరణ భయము ఆ పట్టణస్థు లందరిని పట్టి యుండెను .

1 సమూయేలు 6:4

ఫలిష్తీయులు-మనము ఆయనకు చెల్లింపవలసిన అపరాధార్థమైన అర్పణ మేదని వారినడుగగా వారు-మీ అందరిమీదను మీ సర్దారులందరి మీదను ఉన్నతెగులు ఒక్కటే గనుక , ఫిలిష్తీయుల సర్దారుల లెక్క చొప్పున అయిదు బంగారపు గడ్డల రూపములను, అయిదు బంగారపు పందికొక్కులను చెల్లింపవలెను.

యెహొషువ 13:3

కనానీయులవని యెంచబడిన ఉత్తరదిక్కున ఎక్రోనీయుల సరిహద్దువరకును ఫిలిష్తీయుల అయిదుగురు సర్దారులకు చేరిన గాజీయులయొక్కయు అష్డోదీయులయొక్కయు అష్కెలోనీయులయొక్కయు గాతీయుల యొక్కయు ఎక్రోనీయులయొక్కయు దేశమును

దావీదును
1 సమూయేలు 28:1

ఆ దినములలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయవలెనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా , ఆకీషు దావీదును పిలిచి -నేను దండెత్తగా నీవును నీ జనులును నాతో కూడ యుద్ధమునకు బయలుదేరి రావలెనని పరిష్కారముగా తెలిసికొనుమనగా

1 సమూయేలు 28:2

దావీదు -నీ దాసుడనైన నేను చేయబోవు కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలిసికొందు వనెను . అందుకు ఆకీషు -ఆలాగైతే నిన్ను ఎప్పటికి నాకు సంరక్షకుడుగా నిర్ణయింతు ననెను .