ఇశ్రాయేలీయులు యెహోవాచేత సెలవుపొందకయే వారి ఆహారములో కొంత పుచ్చుకొనగా
దీర్ఘశాంతముగలవాడు మహావివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగాపొందును.
పరాక్రమశాలికంటె దీర్ఘశాంతముగలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకొనువానికంటె తన మనస్సును స్వాధీనపరచుకొనువాడు శ్రేష్ఠుడు
ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు తొందరపడి నడచువాడు దారి తప్పిపోవును. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును
ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును.
ఆలోచన లేక వ్యాజ్యెమాడుటకు పోకుము నీ పొరుగువాడు నిన్ను అవమానపరచిదాని అంతమున ఇక నీవేమి చేయుదువని నీతో అనునేమో.
నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదా నించువాడునై యుండవలెను.
ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు.
సౌలు పైవస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సు నొచ్చి
ఇతడు యెహోవాచేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవాచేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను , యెహోవానుబట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పెను .
ప్రియులారా , మీకు మీరే పగతీర్చు కొనక , దేవుని ఉగ్రతకు చోటియ్యుడి -పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది.
కాబట్టి , నీ శత్రువు ఆకలి గొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పి గొనియుంటే దాహమిమ్ము ; ఆలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు.
కీడు వలన జయింప బడక , మేలు చేత కీడును జయించుము .
కాబట్టి దావీదు అతనియొద్దనున్న ఆరు వందల మందియును బయలుదేరి బెసోరు వాగు గట్టుకు రాగా వారిలో రెండువందల మంది వెనుక దిగవిడువబడిరి .
దావీదును నాలుగు వందల మందియును ఇంక తరుముచు పోయిరి గాని ఆ రెండువందల మంది అలసట పడి బెసోరు వాగు దాటలేక ఆగిరి . ఆ నాలుగు వందలమంది పోవుచుండగా
అలసటచేత దావీదును వెంబడించలేక బెసోరు వాగు దగ్గర నిలిచిన ఆ రెండువందల మంది యొద్దకు దావీదు పోగా వారు దావీదును అతనియొద్దనున్న జనులను ఎదుర్కొనుటకై బయలుదేరి వచ్చిరి. దావీదు ఈ జనులయొద్దకు వచ్చి వారి యోగక్షేమమడుగగా
దావీదు తోకూడ వెళ్లిన వారిలో దుర్మార్గులును , పనికి మాలినవారునైన కొందరు -వీరు మనతోకూడ రాక నిలిచిరి గనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరల వచ్చిన దోపుడు సొమ్ములో మన మేమియు వీరికియ్యము ; తమ భార్య పిల్లలను వారు తీసికొని పోవచ్చు ననిరి .
అందుకు దావీదు వారితో ఇట్లనెను -నా సహోదరులారా , యెహోవా మనలను కాపాడి మనమీదికి వచ్చిన యీ దండును మనకప్పగించి మనకు దయచేసిన దాని విషయములో మీరు ఈలాగున చేయ కూడదు .
మీరు చెప్పినది యెవరు ఒప్పుకొందురు ? యుద్ధమునకు పోయినవాని భాగమెంతో సామాను నొద్ద నిలిచిన వాని భాగము అంతే అని వాడుక మాట; అందరు సమముగానే పాలు పంచుకొందురు గదా