నెమ్మది గలిగి పొమ్మని
1 సమూయేలు 20:22

అయితే-బాణములు నీకు అవతలనున్నవని నేను వానితో చెప్పిన యెడల పారిపొమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడని తెలిసికొని నీవు ప్రయాణమై పోవలెను .

1 సమూయేలు 1:17

అంతట ఏలీ -నీవు క్షేమముగా వెళ్లుము ; ఇశ్రాయేలు దేవునితో నీవు చేసికొనిన మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా

సంఖ్యాకాండము 6:26

యెహోవా నీమీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక.

లూకా 7:50

అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను , సమాధానము గలదానవై వెళ్లుమని ఆ స్త్రీతో చెప్పెను .

అపొస్తలుల కార్యములు 16:36

చెరసాల నాయకుడీ మాటలు పౌలునకు తెలిపి మిమ్మును విడుదలచేయుమని న్యాయాధిపతులు వర్తమానము పంపియున్నారు గనుక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పెను.

దావీదు లేచి
1 సమూయేలు 23:18

వీరిద్దరు యెహోవా సన్నిధిని నిబంధన చేసికొనిన తరువాత దావీదు వనములో నిలిచెను , యోనాతాను తన యింటికి తిరిగి వెళ్లెను .