బేత్‌ హోరోను
యెహొషువ 10:11

మరియు వారు ఇశ్రాయేలీయుల యెదుటనుండి బేత్‌హోరోనుకు దిగిపోవుత్రోవను పారిపోవుచుండగా, వారు అజేకాకు వచ్చువరకు యెహోవా ఆకాశమునుండి గొప్ప వడగండ్లను వారిమీద పడవేసెను గనుక వారు దానిచేత చనిపోయిరి. ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారికంటె ఆ వడగండ్లచేత చచ్చినవారు ఎక్కువ మందియయిరి.

యెహొషువ 16:3

అది బేతేలు నుండి లూజువరకు పోయి అతారోతు అర్కీయుల సరిహద్దువరకు సాగి క్రింది బేత్‌హోరోనువరకును గెజెరు వరకును పడమటివైపుగా యప్లేతీయుల సరిహద్దువరకు వ్యాపించెను. దాని సరిహద్దు సముద్రమువరకు సాగెను.

యెహొషువ 16:5

ఎఫ్రాయిమీయుల సరిహద్దు, అనగా వారి వంశముల చొప్పున వారికి ఏర్పడిన సరిహద్దు అతారోతుఅద్దారు నుండి మీది బేత్‌హోరోనువరకు తూర్పుగా వ్యాపించెను.

యెహొషువ 18:13

అక్కడనుండి ఆ సరిహద్దు లూజు వైపున, అనగా బేతేలను లూజు దక్షిణమువరకు సాగి క్రింది బెత్‌హోరోనుకు దక్షిణముననున్న కొండమీది అతారోతుఅద్దారువరకు వ్యాపించెను.

యెహొషువ 18:14

అక్కడనుండి దాని సరిహద్దు దక్షిణమున బెత్‌హోరోనుకును ఎదురుగా నున్న కొండనుండి పడమరగా దక్షిణమునకు తిరిగి అక్కడ నుండి యూదా వంశస్థుల పట్టణమైన కిర్యాత్బాలు అనగా కిర్యత్యారీమువరకు వ్యాపించెను, అది పడమటిదిక్కు.

1దినవృత్తాంతములు 6:68

యొక్మెయామును దాని గ్రామములును బేత్‌హోరోనును దాని గ్రామములును,

2 దినవృత్తాంతములు 8:5
ఇదియు గాక అతడు ఎగువ బేత్‌హోరోను దిగువ బేత్‌హోరోను గవునులు అడ్డగడలుగల ప్రాకారపట్టణములుగా కట్టించెను.
జెబోయిము
ఆదికాండము 14:2

వారు సొదొమ రాజైన బెరాతోను, గొమొఱ్ఱా రాజైన బిర్షాతోను, అద్మా రాజైన షినాబుతోను, సెబోయీయుల రాజైన షెమేబెరుతోను, సోయరను బెలరాజుతోను యుద్ధము చేసిరి.

నెహెమ్యా 11:34

హాదీదులోను జెబోయిములోను నెబల్లాటులోను

హొషేయ 11:8

ఎఫ్రాయిమూ , నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును ? ఇశ్రాయేలూ , నేను నిన్ను ఎట్లు విసర్జింతును? అద్మానువలె నిన్ను నేను ఎట్లు చేతును ? సెబోయీమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును ? నా మనస్సు మారినది , సహింపలేకుండ నా యంతరంగము మండుచున్నది .