యాజకులను వస్త్రహీనులనుగాచేసి వారిని తోడుకొనిపోవును స్థిరముగా నాటుకొనినవారిని ఆయన పడగొట్టును.
వాక్చాతుర్యము గలవారి పలుకును ఆయన నిరర్థకము చేయును పెద్దలను బుద్ధిలేనివారినిగా చేయును.
అధిపతులను ఆయన తిరస్కారము చేయును బలాఢ్యుల నడికట్లను విప్పును.
వారి పటుత్వముగల నడకలు అడ్డగింపబడును వారి స్వకీయాలోచన వారిని కూల్చును.
వారు వాగురలమీద నడచువారు తమ కాళ్లే వారిని వలలోనికి నడిపించును.
బోను వారి మడిమెను పట్టుకొనును వల వారిని చిక్కించుకొనును.
వారిని చిక్కించుకొనుటకై ఉరి నేలను ఉంచబడును వారిని పట్టుకొనుటకై త్రోవలో ఉచ్చు పెట్టబడును.
నలుదిక్కుల భీకరమైనవి వారికి భయము కలుగజేయును భయములు వారిని వెంటాడి తరుమును.
వారి బలము క్షీణించిపోవును వారిని కూల్చుటకు ఆపద కాచియుండును.
నీ ఆగ్రహమును ప్రవాహములుగా కుమ్మరించుము గర్విష్టులైన వారినందరిని చూచి వారిని క్రుంగజేయుము.
గర్విష్టులైన వారిని చూచి వారిని అణగగొట్టుము దుష్టులు ఎక్కడనున్నను వారిని అక్కడనే అణగద్రొక్కుము.
భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టువలె వాడు వర్ధిల్లియుండెను.
అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను నేను వెదకితిని గాని వాడు కనబడకపోయెను.
రాజులను తృణీకరించుచు త్రోవలేని యెడారిలో వారిని తిరుగులాడజేయువాడు .
ఎవని గర్వము వానిని తగ్గించును వినయమనస్కుడు ఘనతనొందును
ఒకడు సింహము నొద్దనుండి తప్పించుకొనగా ఎలుగుబంటి యెదురైనట్టు , వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వాని కరచినట్టు ఆ దినముండును.
యెహోవా దినము నిజముగా వెలుగై యుండదు కాదా ? వెలుగు ఏమాత్రమును లేక అది కారుచీకటిగా ఉండదా?
అనాతు కుమారుడైన షవ్గురు దినములలో యాయేలు దినములలో రాజమార్గములు ఎడారులాయెను ప్రయాణస్థులు చుట్టుత్రోవలలోనే నడిచిరి.
కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెననొందును గుడారములలోనుండు స్త్రీలలో ఆమె దీవెన నొందును.
వారి భోజనము వారికి ఉరిగా నుండును గాక వారు నిర్భయులైయున్నప్పుడు అది వారికి ఉరిగా నుండును గాక.
దుష్టులకు నెమ్మదియుండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు.