బేత్‌హోరోను
యెహొషువ 18:13

అక్కడనుండి ఆ సరిహద్దు లూజు వైపున, అనగా బేతేలను లూజు దక్షిణమువరకు సాగి క్రింది బెత్‌హోరోనుకు దక్షిణముననున్న కొండమీది అతారోతుఅద్దారువరకు వ్యాపించెను.

1 రాజులు 9:15-17
15

యహోవా మందిరమును సొలొమోను నగరమును మిల్లోను, యెరూషలేముయొక్క ప్రాకారమును హాసోరు మెగిద్దో గెజెరు అను పట్టణములను కట్టించుటకు సొలొమోను వెట్టి వారిని పెట్టెను.

16

ఐగుప్తు రాజైన ఫరో గెజెరుమీదికి వచ్చి దాని పట్టుకొని అగ్నిచేత కాల్చి ఆ పట్టణమందున్న కనానీయులను హతము చేసి దానిని తన కుమార్తెయైన సొలొమోను భార్యకు కట్నముగా ఇచ్చెను.

17

సొలొమోను గెజెరును కట్టించెను, మరియు దిగువను బేత్‌హోరోనును,

1దినవృత్తాంతములు 7:24

అతని కుమార్తెయైన షెయెరా ఉత్తరపు బేత్‌హోరోనును దక్షిణపు బేత్‌హోరోనును ఉజ్జెన్‌ షెయెరాను కట్టించెను.

1దినవృత్తాంతములు 7:28

వారికి స్వాస్థ్యములైన నివాసస్థలములు బేతేలు దాని గ్రామములు తూర్పుననున్న నహరాను పడమటనున్న గెజెరు దాని గ్రామములు, షెకెము దాని గ్రామములు, గాజా దాని గ్రామములును ఉన్నంతవరకు వ్యాపించెను.

2 దినవృత్తాంతములు 8:5
ఇదియు గాక అతడు ఎగువ బేత్‌హోరోను దిగువ బేత్‌హోరోను గవునులు అడ్డగడలుగల ప్రాకారపట్టణములుగా కట్టించెను.
గెజెరు
సంఖ్యాకాండము 34:6

పడమటి సరిహద్దు ఏదనగా మహాసముద్రము, అదే మీకు పడమటి సరిహద్దుగా నుండును.