నీ శత్రువుని యెద్దయినను గాడిదయైనను తప్పిపోవుచుండగా అది నీకు కనబడినయెడల అగత్యముగా దాని తోలుకొనివచ్చి వాని కప్పగింపవలెను.
నీవు నీ పగవాని గాడిద బరువుక్రింద పడియుండుట చూచి, దానినుండి తప్పింపకయుందునని నీవు అనుకొనినను అగత్యముగా వానితో కలిసి దాని విడిపింపవలెను.
నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.
అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరచుకొనగోరి , అతడు అవును గాని నా పొరుగువా డెవడని యేసు నడిగెను .
అందుకు యేసు ఇట్లనెను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోపట్టణము నకు దిగి వెళ్లుచు దొంగల చేతిలో చిక్కెను ; వారు అతని బట్టలు దోచుకొని , అతని కొట్టి కొరప్రాణముతో విడిచి
అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్లుట తటస్థించెను . అతడు అతనిని చూచి , ప్రక్కగా పోయెను .
ఆలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను .
అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవుచు , అతడు పడియున్నచోటికి వచ్చి
అతనిని చూచి , అతనిమీద జాలిపడి , దగ్గరకుపోయి , నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి , తన వాహనము మీద ఎక్కించి యొక పూటకూళ్లవాని యింటికి తీసికొనిపోయి అతని పరమర్శించెను
మరునాడతడు రెండు దేనారములు తీసి ఆ పూట కూళ్లవాని కిచ్చి ఇతని పరామర్శించుము , నీవింకే మైనను ఖర్చు చేసినయెడల నేను మరల వచ్చునప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పి పోయెను .
కాగా దొంగలచేతిలో చిక్కినవానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువా డాయెనని నీకు తోచుచున్నది అని యేసు అడుగగా అతడు --అతని మీద జాలి పడినవాడే అనెను .
అందుకు యేసు నీవును వెళ్లి ఆలాగు చేయుమని అతనితో చెప్పెను .
కాగా బలవంతులమైన మనము , మనలను మనమే సంతోషపరచు కొనక , బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై యున్నాము.
కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మలకొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను; నన్నును నేను వ్యయపరచుకొందును. నేను మిమ్మును ఎంత యెక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా?
సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనినయెడల ఆత్మసంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు, సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచిదారికి తీసికొనిరావలెను.
ఒకని భారములనొకడు భరించి, యీలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి.
సహోదరులారా, మేము మీకు బోధించునది ఏమనగా అక్రమముగా నడుచుకొనువారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడినవారిని దైర్యపరచుడి, బలహీనులకు ఊతనియ్యుడి, అందరియెడల దీర్ఘశాంతముగలవారై యుండుడి.
కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి.
మరియు కుంటికాలు బెణకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసికొనుడి.