అయినను దాసివలన పుట్టినవాడు శరీరప్రకారము పుట్టెను, స్వతంత్రురాలివలన పుట్టినవాడు వాగ్దానమునుబట్టి పుట్టెను.
మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాముయొక్క సంతానమైయుండి వాగ్దాన ప్రకారము వారసులైయున్నారు.
ఆ ప్రవక్తలకును, దేవుడు అబ్రాహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నియు ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును, మీరు వారసులై యున్నారు.
అతడు లోకమునకు వారసు డగునను వాగ్దానము అబ్రాహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలుగలేదు గాని విశ్వాసమువలననైన నీతి మూలముగానే కలిగెను.
ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన యెడల విశ్వాసము వ్యర్థమగును , వాగ్దానమును నిరర్థక మగును.
ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును ; ధర్మశాస్త్రము లేని యెడల అతిక్రమమును లేకపోవును .
ఈ హేతువుచేతను ఆ వాగ్దానమును యావ త్సంతతికి , అనగా ధర్మశాస్త్రముగలవారికి మాత్రము కాక అబ్రాహామునకున్నట్టి విశ్వాసముగలవారికి కూడ దృఢము కావలెనని, కృప ననుసరించినదై యుండునట్లు , అది విశ్వాసమూలమైనదాయెను .
తాను విశ్వసించిన దేవుని యెదుట , అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని యెదుట, అతడు మన కందరికి తండ్రియై యున్నాడు -ఇందును గూర్చి -నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడియున్నది .
నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానినిబట్టి తాననేక జనములకు తండ్రి యగునట్లు , నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను .
అనగా శరీరసంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని యెంచబడుదురు .
వాగ్దానరూపమైన వాక్య మిదే -మీదటికి ఈ సమయము నకు వచ్చెదను ; అప్పుడు శారాకు కుమారుడు కలుగును .