సహోదరులందరు
రోమీయులకు 16:16

పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకని కొకడు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములన్నియు మీకు వందనములు చెప్పుచున్నవి.

రోమీయులకు 16:21

నా జతపనివాడగు తిమోతి నా బంధువులగు లూకియ యాసోను , సోసిపత్రు అనువారును మీకు వందనములు చెప్పుచున్నారు.

రోమీయులకు 16:23

నాకును యావ త్సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయియు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణపు ఖజానాదారుడగు ఎరస్తును సహోదరుడగు క్వర్తును మీకు వందనములు చెప్పుచున్నారు.

2 కొరింథీయులకు 13:13

పరిశుద్ధులందరు మీకు వందనములు చెప్పుచున్నారు.

ఫిలిప్పీయులకు 4:22

నా తోకూడ ఉన్న సహోదరులందరు మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధు లందరును ముఖ్యముగా కైసరు ఇంటివారిలో ఉన్న పరిశుద్ధులును మీకు వందనములు చెప్పుచున్నారు.

ఫిలేమోనుకు 1:23

క్రీస్తు యేసు నందు నాతోడి ఖైదీయైన ఎపఫ్రా ,

ఫిలేమోనుకు 1:24

నా జతపనివారైన మార్కు , అరిస్తార్కు , దేమా , లూకా వందనములు చెప్పుచున్నారు.

హెబ్రీయులకు 13:24

మీపైని నాయకులైనవారికందరికిని పరిశుద్ధులకందరికిని నా వందనములు చెప్పుడి. ఇటలీవారు మీకు వందనములు చెప్పుచున్నారు.

వందనములు
2 కొరింథీయులకు 13:12

పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకరికి ఒకరు వందనములు చేసికొనుడి.

1 థెస్సలొనీకయులకు 5:26

పవిత్రమైన ముద్దుపెట్టుకొని సహోదరులకందరికిని వందనములు చేయుడి.

1 పేతురు 5:14

ప్రేమగల ముద్దుతో ఒకనికి ఒకడు వందనములు చేయుడి.క్రీస్తునందున్న మీకందరికిని సమాధానము కలుగును గాక. ఆమేన్‌.