అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాటలాడలేక పోయినందున , ఆలయము నందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి ; అప్పుడతడు వారికి సంజ్ఞలు చేయుచు , మూగవాడై యుండెను .
వారు వేరొక దోనె లోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి; వారు వచ్చి రెండు దోనెలు మునుగునట్లు నింపిరి.
అతడుఊరకుండుడని వారికి చేసైగచేసి, ప్రభువు తన్ను చెరసాలలోనుండి యేలాగు తీసికొనివచ్చెనో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయుడని చెప్పి
అప్పుడు పౌలు నిలువబడి చేసైగ చేసి ఇట్లనెను
అతడు సెలవిచ్చిన తరువాత పౌలు మెట్లమీద నిలువబడి జనులకు చేసైగ చేసెను. వారు నిశ్చబ్దముగా ఉన్నప్పుడు అతడు హెబ్రీభాషలో ఇట్లనెను