అందుకు యేసుఏ అధికారమువలన ఈ కార్యములు చేయుచున్నానో నేను మీతో చెప్పననివారి తోననెను
లూకా 22:68

అదియుగాక నేను మిమ్మును అడిగిన యెడల మీరు నాకు ఉత్తరము చెప్పరు .

యోబు గ్రంథము 5:12

వంచకులు తమ పన్నాగములను నెరవేర్చనేరకుండ ఆయన వారి ఉపాయములను భంగపరచును

యోబు గ్రంథము 5:13

జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొనును కపటుల ఆలోచనను తలక్రిందుచేయును

సామెతలు 26:4

వాని మూఢతచొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమియ్యకుము ఇచ్చినయెడల నీవును వాని పోలియుందువు.

సామెతలు 26:5

వాని మూఢతచొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమిమ్ము ఆలాగు చేయనియెడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకొనును.

మత్తయి 15:14

వారి జోలికి పోకుడి; వారు గ్రుడ్డివారైయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన యెడల వారిద్దరు గుంటలో పడుదురు గదా అనెను.

మత్తయి 16:4

వ్యభిచారులైనచెడ్డతరము వారు సూచక క్రియ నడుగుచున్నారు, అయితే యోనాను గూర్చిన సూచకక్రియయేగాని మరి ఏ సూచక క్రియయైన వారి కనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్లిపోయెను.

మత్తయి 21:27

అందుకాయనఏ అధికారమువలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అదియు మీతో చెప్పను.

మార్కు 11:33

గనుక ప్రజలకు భయపడిఆ సంగతి మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి. అందుకు యేసుఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో అదియు నేను మీతో చెప్పననెను.