అయిదు
మత్తయి 10:29

రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలను పడదు.

అయినను
లూకా 12:24

కాకుల సంగతి విచారించి చూడుడి . అవి విత్తవు , కోయవు , వాటికి గరిసె లేదు , కొట్టు లేదు ; అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు ; మీరు పక్షుల కంటె ఎంతో శ్రేష్ఠులు .

లూకా 12:27

అవి కష్టపడవు, వడుకవు; అయినను తన సమస్తవైభవముతో కూడిన సొలొమోను సయితము వీటిలో ఒకదానివలెనైన అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను.

కీర్తనల గ్రంథము 50:10
అడవిమృగములన్నియు వేయికొండలమీది పశువులన్నియు నావేగదా
కీర్తనల గ్రంథము 50:11
కొండలలోని పక్షులన్నిటిని నేనెరుగుదును పొలములలోని పశ్వాదులు నా వశమై యున్నవి.
కీర్తనల గ్రంథము 113:5
ఉన్నతమందు ఆసీనుడైయున్న మన దేవుడైన యెహో వాను పోలియున్నవాడెవడు?
కీర్తనల గ్రంథము 113:6
ఆయన భూమ్యాకాశములను వంగిచూడననుగ్రహించు చున్నాడు.
కీర్తనల గ్రంథము 145:15
సర్వజీవుల కన్నులు నీవైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుదువు.
కీర్తనల గ్రంథము 145:16
నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరచుచున్నావు.
కీర్తనల గ్రంథము 147:9
పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారమిచ్చువాడు.