నమ్మకపోయిరి
మార్కు 16:13

వారు వెళ్లి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని, వారు వీరి మాటనైనను నమ్మక పోయిరి.

మార్కు 16:14

పిమ్మట పదునొకండుమంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై, తాను లేచిన తరువాత తన్ను చూచినవారి మాట నమ్మనందున వారి అపనమి్మక నిమిత్తమును హృదయకాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను.

మార్కు 9:19

అందుకాయన విశ్వాసములేని తరమువారలారా, నేను ఎంతకాలము మీతో నుందును? ఎంతవరకు మిమ్మును సహింతును? వానిని నాయొద్దకు తీసికొని రండని వారితో చెప్పగా

నిర్గమకాండము 6:9

మోషే ఇశ్రాయేలీయులతో ఆలాగు చెప్పెను. అయితే వారు మనోవ్యాకులమునుబట్టియు కఠిన దాసత్వమును బట్టియు మోషే మాట వినరైరి.

యోబు గ్రంథము 9:16

నేను మొఱ్ఱపెట్టినప్పుడు ఆయన నాకుత్తరమిచ్చినను ఆయన నా మాట ఆలకించెనని నేను నమ్మజాలను.

లూకా 24:11

అయితే వారి మాటలు వీరి దృష్టికి వెఱ్ఱిమాటలుగా కనబడెను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు.

లూకా 24:23-35
23

కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రదికియున్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి .

24

మాతో కూడ ఉన్నవారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్లి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి గాని , ఆయనను చూడ లేదని ఆయనతో చెప్పిరి .

25

అందుకాయన అవివేకులారా , ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటిని నమ్మని మంద మతులారా ,

26

క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమ లో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి

27

మోషేయు సమస్త ప్రవక్తలును మొదలుకొని లేఖనము లన్నిటి లో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను .

28

ఇంతలో తాము వెళ్లుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన యింక కొంతదూరము వెళ్లునట్లు అగపడగా

29

వారు సాయంకాలము కావచ్చినది , ప్రొద్దు గ్రుంకినది , మాతో కూడ ఉండుమని చెప్పి , ఆయనను బలవంతముచేసిరి గనుక ఆయన వారితో కూడ ఉండుటకు లోపలికి వెళ్లెను .

30

ఆయన వారితో కూడ భోజనమునకు కూర్చున్నప్పుడు , ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాని విరిచి వారికి పంచి పెట్టగా

31

వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి; అంతట ఆయన వారికి అదృశ్యుడాయెను .

32

అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండ లేదా అని యొకనితో ఒకడు చెప్పుకొనిరి .

33

ఆ గడియలోనే వారు లేచి , యెరూషలేము నకు తిరిగి వెళ్లగా , పదునొకొండుగురు శిష్యులును వారితో కూడ ఉన్నవారును కూడివచ్చి

34

ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడెనని చెప్పుకొనుచుండిరి . వారిది విని

35

త్రోవలో జరిగిన సంగతులును , ఆయన రొట్టె విరుచుటవలన తమ కేలాగు తెలియబడెనో అదియు తెలియజేసిరి .