అత్యానందభరితులై
ద్వితీయోపదేశకాండమ 32:13

భూమియొక్క ఉన్నతస్థలములమీద వాని నెక్కించెను పొలముల పంట వానికి తినిపించెను కొండబండనుండి తేనెను చెకుముకి రాతిబండనుండి నూనెను అతనికి జుఱ్ఱించెను.

కీర్తనల గ్రంథము 67:4

జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయును గాక

కీర్తనల గ్రంథము 105:3

ఆయన పరిశుద్ధ నామమునుబట్టి అతిశయించుడి . యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక .

లూకా 2:10

అయితే ఆ దూత భయ పడకుడి ; ఇదిగో ప్రజ లందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను ;

లూకా 2:20

అంతట ఆ గొఱ్ఱల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటినిగూర్చి దేవుని మహిమ పరచుచు స్తోత్రముచేయుచు తిరిగి వెళ్లిరి.

అపొస్తలుల కార్యములు 13:46-48
46

అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే; అయినను మీరు దానిని త్రోసివేసి, మిమ్మును మీరే నిత్యజీవమునకు అపాత్రులుగా ఎంచుకొను

47

ఏలయనగా నీవు భూదిగంతములవరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభువు మాకాజ్ఞాపించెననిరి.

48

అన్యజనులు ఆ మాటవిని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి; మరియు నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వారందరు విశ్వసించిరి.

రోమీయులకు 15:9-13
9
అందు విషయమై ఈ హేతువుచేతను అన్యజను లలో నేను నిన్ను స్తుతింతును ; నీ నామ సంకీర్తనము చేయుదును అని వ్రాయబడియున్నది .
10
మరియు అన్యజనులారా , ఆయన ప్రజ లతో సంతోషించుడి అనియు
11
మరియు సమస్త అన్యజనులారా , ప్రభువును స్తుతించుడి సకల ప్రజలు ఆయనను కొనియాడుదురు గాక అనియు చెప్పియున్నది.
12
మరియు యెషయా యీలాగు చెప్పుచున్నాడు యెష్షయిలోనుండి వేరు చిగురు, అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును ; ఆయన యందు అన్యజనులు నిరీక్షణ యుంచుదురు.
13
కాగా మీరు పరిశు ద్ధాత్మ శక్తి పొంది, విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తా నందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక .