చెప్పెను
మత్తయి 13:24

ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను, ఏమనగాపరలోకరాజ్యము, తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక మనుష్యుని పోలియున్నది.

లూకా 19:11

వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుటవలనను , దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుటవలనను , ఆయన మరియొక ఉపమానము చెప్పెను . ఏమనగా,

లూకా 20:9

అంతట ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్ప సాగెను ఒక మనుష్యుడు ద్రాక్షతోట నాటించి, కాపులకు గుత్తకిచ్చి, దేశాంతరముపోయి బహుకాల ముండెను.

పరలోకరాజ్యము
మార్కు 4:30-32
30

మరియు ఆయన ఇట్లనెనుదేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము? ఏ ఉపమానముతో దానిని ఉపమించెదము?

31

అది ఆవగింజను పోలియున్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమిమీదనున్న విత్తనములన్నిటికంటె చిన్నదే గాని

32

విత్తబడిన తరువాత అది మొలిచి యెదిగి కూర మొక్కలన్నిటికంటె పెద్దదైగొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను.

లూకా 13:18

ఆయన దేవుని రాజ్యము దేనిని పోలియున్నది? దేనితో దాని పోల్తును?

లూకా 13:19

ఒక మనుష్యుడు తీసికొని పోయి తన తోటలోవేసిన ఆవగింజను పోలియున్నది. అది పెరిగి వృక్షమాయెను; ఆకాశపక్షులు దాని కొమ్మల యందు నివసించెననెను.