ఆజ్ఞలు
లేవీయకాండము 7:37

ఇది దహనబలిని గూర్చియు అపరాధపరిహారార్థపు నైవేద్యమును గూర్చియు పాపపరిహారార్థబలినిగూర్చియు అపరాధపరిహారార్థబలినిగూర్చియు ప్రతిష్ఠితార్పణమునుగూర్చియు సమాధానబలినిగూర్చియు చేయబడిన విధి.

లేవీయకాండము 7:38

ఇశ్రాయేలీయులు యెహోవాకు అర్పణములను తీసికొనిరావలెనని సీనాయి అరణ్యములో ఆయన ఆజ్ఞాపించిన దినమున యెహోవా సీనాయి కొండమీద మోషేకు ఆలాగుననే ఆజ్ఞాపించెను.

లేవీయకాండము 11:46

అపవిత్రమైనదానికిని పవిత్రమైనదానికిని తినదగిన జంతువులకును తినదగని జంతువులకును భేదము చేయునట్లు

లేవీయకాండము 13:59

అప్పుడు అది పవిత్రమగును. బొచ్చు బట్టయందేగాని నారబట్టయందేగాని పడుగునందేగాని పేకయందేగాని తోలువస్తువులయందేగాని యుండు కుష్ఠుపొడను గూర్చి అది పవిత్రమని అపవిత్రమని నీవు నిర్ణయింపవలసిన విధి యిదే.

లేవీయకాండము 14:54-57
54

ప్రతివిధమైన కుష్ఠుపొడను గూర్చియు, బొబ్బను గూర్చియు

55

వస్త్రకుష్ఠమునుగూర్చియు, వస్త్రమునకైనను ఇంటికైనను కలుగు కుష్ఠమునుగూర్చియు,

56

వాపును గూర్చియు, పక్కునుగూర్చియు, నిగనిగలాడు మచ్చను గూర్చియు,

57

ఒకడు ఎప్పుడు అపవిత్రుడగునో, యెప్పుడు పవిత్రుడగునో తెలియజేయుటకు ఇది కుష్ఠమును గూర్చిన విధి.

లేవీయకాండము 15:32

స్రావముగలవానిగూర్చియు, వీర్యస్ఖలనమువలని అపవిత్రతగలవానిగూర్చియు, కడగానున్న బలహీనురాలిని గూర్చియు,

లేవీయకాండము 15:33

స్రావముగల స్త్రీ పురుషులను గూర్చియు, అపవిత్రురాలితో శయనించు వాని గూర్చియు విధింపబడినది ఇదే.

లేవీయకాండము 27:34

ఇవి యెహోవా సీనాయికొండమీద ఇశ్రాయేలీయుల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు.

మోయాబు మైదానములలో
సంఖ్యాకాండము 26:3

కాబట్టి యిరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయముగల వారిని లెక్కింపుడని యెహోవా మోషేకును ఐగుప్తుదేశమునుండి వచ్చిన ఇశ్రాయేలీయులకును ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీయులు

సంఖ్యాకాండము 33:50

యెరికోయొద్ద, అనగా యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.

సంఖ్యాకాండము 35:1

మరియు యెరికో యొద్ద యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను