హెపెరు కుమారుడైన సెలోపెహాదుకు కుమార్తెలేగాని కుమారులు పుట్టలేదు. సెలోపెహాదు కుమార్తెల పేరులు మహలా నోయా హొగ్లా మిల్కా తిర్సా.
యోసేపు పుత్రులవంశములలో మాకీరు కుమారుడును మనష్షే మనుమడునైన గిలాదుయొక్క పుత్రువంశముల పెద్దలు వచ్చి మోషేయెదుటను ఇశ్రాయేలీయుల పితరుల కుటుంబముల ప్రధానుల యెదుటను మాటలాడి యిట్లనిరి
ఆ దేశమును వంతు చీట్లచొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా ఇయ్యవలెనని యెహోవా మా యేలినవాని కాజ్ఞాపించెను. మరియు మా సహోదరుడైన సెలోపెహాదు స్వాస్థ్యమును అతని కుమార్తెలకు ఇయ్యవలెనని మా యేలినవాడు యెహోవాచేత ఆజ్ఞనొందెను.
అయితే వారు ఇశ్రాయేలీయులలో వేరు గోత్రముల వారి నెవరినైనను పెండ్లిచేసికొనిన యెడల వారి స్వాస్థ్యము మా పితరుల స్వాస్థ్యమునుండి తీయబడి, వారు కలిసికొనిన వారి గోత్రస్వాస్థ్యముతో కలుపబడి, మాకు వంతు చీట్లచొప్పున కలిగిన స్వాస్థ్యమునుండి విడిపోవును.
కాబట్టి ఇశ్రాయేలీయులకు సునాద సంవత్సరము వచ్చునప్పుడు వారి స్వాస్థ్యము వారు కలిసికొనిన వారి గోత్ర స్వాస్థ్యముతో కలుపబడును గనుక ఆ వంతున మా పితరుల గోత్రస్వాస్థ్యము తగ్గిపోవుననగా
మోషే యెహోవా సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి యిట్లనెను యోసేపు పుత్రుల గోత్రికులు చెప్పినది న్యాయమే.
యెహోవా సెలోపెహాదు కుమార్తెలను గూర్చి సెలవిచ్చిన మాట ఏదనగా వారు తమకు ఇష్టులైనవారిని పెండ్లి చేసికొనవచ్చును గాని వారు తమ తండ్రి గోత్రవంశములోనే పెండ్లి చేసికొనవలెను.
ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము ఒక గోత్రములోనుండి వేరొక గోత్రములోనికి పోకూడదు. ఇశ్రాయేలీయులలో ప్రతివాడును తన తన పితరుల గోత్రస్వాస్థ్యమును హత్తుకొని యుండవలెను.
మరియు ఇశ్రాయేలీయులకు వారి వారి పితరుల స్వాస్థ్యము కలుగునట్లు, ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వాస్థ్యముగల ప్రతి కుమార్తెయు తన తండ్రి గోత్రవంశములోనే పెండ్లిచేసికొనవలెను.
స్వాస్థ్యము ఒక గోత్రములోనుండి వేరొక గోత్రమునకు పోకూడదు. ఇశ్రాయేలీయుల గోత్రములు వారి వారి స్వాస్థ్యములో నిలిచియుండవలెను.
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోపెహాదు కుమార్తెలు చేసిరి.
సెలోపెహాదు కుమార్తెలైన మహలా, తిర్సా, హొగ్లా, మిల్కా, నోయా తమ తండ్రి సహోదరుని కుమారులను పెండ్లిచేసికొనిరి.
వారు యోసేపు కుమారులైన మనష్షీయులను పెండ్లి చేసికొనిరి గనుక వారి స్వాస్థ్యము వారి తండ్రి గోత్రవంశములోనే నిలిచెను.
మనష్షే మునిమనుమడును మాకీరు ఇనుమనుమడును గిలాదు మనుమడును హెపెరు కుమారుడునైన సెలోపెహాదుకు కుమార్తెలేగాని కుమారులు పుట్టలేదు. అతని కుమార్తెల పేరులు మహలా నోయా హొగ్లా మిల్కా తిర్సా అనునవి.
వారు యాజకుడైన ఎలియాజరు ఎదుటికిని నూను కుమారుడైన యెహోషువ యెదుటికిని ప్రధానుల యెదుటికిని వచ్చి మా సహోదరులమధ్య మాకు స్వాస్థ్యమియ్యవలెనని యెహోవా మోషేకు ఆజ్ఞాపించెనని మనవి చేయగా యెహోషువ యెహోవా సెలవిచ్చినట్టు వారి తండ్రి యొక్క సహోదరులమధ్య వారికి స్వాస్థ్యములిచ్చెను.
కాబట్టి యొర్దాను అద్దరినున్న గిలాదు బాషానులుగాక మనష్షీయులకు పదివంతులు హెచ్చుగా వచ్చెను.
ఏలయనగా మనష్షీయుల స్త్రీ సంతానమును వారి పురుష సంతానమును స్వాస్థ్యములు పొందెను. గిలాదుదేశము తక్కిన మనష్షీయులకు స్వాస్థ్యమాయెను.
మాకీరు, హుప్పీము, షుప్పీముల సోదరిని పెండ్లి యాడెను. దాని సహోదరి పేరు మయకా, రెండవవానికి సెలోపెహాదని పేరు, ఈ సెలోపెహాదుకు కుమార్తెలు మాత్రము పుట్టిరి.
ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.