పిస్గా
సంఖ్యాకాండము 21:20

మోయాబు దేశమందలి లోయలోనున్న బామోతునుండి యెడారికి ఎదురుగానున్న పిస్గాకొండకు వచ్చిరి.

ద్వితీయోపదేశకాండమ 3:27

నీవు ఈ యొర్దానును దాటకూడదు గాని నీవు పిస్గాకొండయెక్కి కన్నులెత్తి పడమటివైపును ఉత్తరవైపును దక్షిణవైపును తూర్పువైపును తేరి చూడుము.

ద్వితీయోపదేశకాండమ 4:49

పిస్గా యూటలకు దిగువగా అరాబా సముద్రమువరకు తూర్పుదిక్కున యొర్దాను అవతల ఆరాబా ప్రదేశమంతయు స్వాధీనపరచుకొనిరి.

ద్వితీయోపదేశకాండమ 34:1

మోషే మోయాబు మైదానమునుండి యెరికో యెదుటనున్న పిస్గాకొండవరకు పోయి నెబోశిఖరమున కెక్కెను.

యేడు బలిపీఠములను కట్టించి
సంఖ్యాకాండము 23:1

అప్పుడు బిలాము ఇక్కడ నేను బలి అర్పించుటకు ఏడు బలిపీఠములను కట్టించి, ఇక్కడ ఏడు కోడెలను ఏడు పొట్టేళ్లను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పెను.

సంఖ్యాకాండము 23:2

బిలాము చెప్పినట్లు బాలాకు చేయగా, బాలాకును బిలామును ప్రతి బలిపీఠముమీద ఒక కోడెను ఒక పొట్టేలును దహనబలిగా అర్పించిరి.

సంఖ్యాకాండము 23:29

బిలాము ఇక్కడ నాకు ఏడు బలిపీఠములను కట్టించి, యిక్కడ ఏడు కోడెలను ఏడు పొట్టేళ్లను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పెను.

యెషయా 1:10

సొదొమ న్యాయాధిపతులారా, యెహోవామాట ఆల కించుడి. గొమొఱ్ఱా జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవి యొగ్గుడి.

యెషయా 1:11

యెహోవా సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలులు నాకేల? దహనబలులగు పాట్టేళ్లును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కస మాయెను కోడెల రక్తమందైనను గొఱ్ఱపిల్లల రక్తమందైనను మేక పోతుల రక్తమందైనను నాకిష్టములేదు.

యెషయా 46:6

దానికి సాగిలపడి నమస్కారము చేయుటకై సంచినుండి బంగారము మెండుగా పోయువారును వెండి తూచువారును దాని దేవతగా నిరూపించవలెనని కంసాలిని కూలికి పిలుతురు.

హొషేయ 12:11

నిజముగా గిలాదు చెడ్డది , అచ్చటివి వ్యర్థములు , గిల్గాలులో జనులు ఎడ్లను బలులగా అర్పింతురు , వారి బలిపీఠములు దున్నినచేని గనిమల మీదనున్న రాళ్లకుప్పలవలె ఉన్నవి