వీరు ఇశ్రాయేలీయులలో తమ తమ పితరుల కుటుంబ ముల ప్రకారము లెక్కింపబడినవారు. తమ తమ సేనల చొప్పున తమ తమ పాళెములలో లెక్కింపబడినవారందరు ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబదిమంది.
సంఖ్యాకాండము 2:9

యూదా పాళెములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయెనుబది యారు వేల నాలుగువందలమంది. వారు ముందర సాగి నడవవలెను.

సంఖ్యాకాండము 1:46

లెక్కింపబడి ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబదిమంది యైరి.

సంఖ్యాకాండము 11:21

అందుకు మోషే నేను ఈ జనులమధ్య ఉన్నాను; వారు ఆరు లక్షల పాదచారులువారు నెలదినములు తినుటకు వారికి మాంసమిచ్చెదనని చెప్పితివి.

సంఖ్యాకాండము 26:51

ఇశ్రాయేలీయులలో లెక్కింపబడిన వీరు ఆరులక్షల వెయ్యిన్ని ఏడు వందల ముప్పదిమంది.

నిర్గమకాండము 12:37

అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసునుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి వారు పిల్లలు గాక కాల్బలము ఆరులక్షల వీరులు.

నిర్గమకాండము 38:26

ఈ పన్ను ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కలో చేరిన వారందరిలో , అనగా ఆరులక్షల మూడు వేల ఐదు వందల ఏబది మందిలో తలకొకటికి అర తులము .