అహీమా
యెహొషువ 11:21

ఆ కాలమున యెహోషువ వచ్చి మన్యదేశములోను, అనగా హెబ్రోనులోను దెబీరులోను అనాబులోను యూదా మన్యములన్నిటిలోను ఇశ్రాయేలీయుల మన్య ప్రదేశములన్నిటిలోను ఉన్న అనాకీయులను నాశనము చేసెను. యెహోషువ వారిని వారి పట్టణములను నిర్మూలము చేసెను.

యెహొషువ 11:22

ఇశ్రాయేలీయుల దేశమందు అనాకీయులలో ఎవడును మిగిలియుండలేదు; గాజాలోను గాతులోను అష్డోదులోను మాత్రమే కొందరు మిగిలియుండిరి.

యెహొషువ 15:13

యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞచొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును, అనగా అనాకీయుల వంశకర్తయైన అర్బాయొక్క పట్టణమును ఇచ్చెను, అది హెబ్రోను.

యెహొషువ 15:14

అక్కడనుండి కాలేబు అనాకుయొక్క ముగ్గురు కుమారులైన షెషయి అహీమాను తల్మయి అను అనాకీయుల వంశీయులను వెళ్లగొట్టి వారిదేశమును స్వాధీనపరచుకొనెను.

న్యాయాధిపతులు 1:10

మరియు యూదా వంశస్థులు హెబ్రోనులో నివసించిన కనానీయులమీదికి పోయి, షేషయిని అహీమానును తల్మయిని హతముచేసిరి.

హెబ్రోను
ఆదికాండము 13:18

అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూరవృక్షవనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను.

ఆదికాండము 23:2

శారా కనాను దేశమందలి హెబ్రోనను కిర్యతర్బాలో మృతిబొందెను; అప్పుడు అబ్రాహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి యేడ్చుటకును వచ్చెను.

యెహొషువ 14:13-15
13

యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను.

14

కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనెజీయుని కుమారుడైన కాలేబునకు నేటివరకు స్వాస్థ్యముగా నున్నది.

15

పూర్వము హెబ్రోను పేరు కిర్యతర్బా. అర్బా అనాకీయులలో గొప్పవాడు అప్పుడు దేశము యుద్ధములేకుండ నెమ్మదిగా ఉండెను.

యెహొషువ 21:13

యాజకుడైన అహరోను సంతానపువారికి వారు నరహంతకునికి ఆశ్రయపట్టణమైన హెబ్రోనును

2 సమూయేలు 2:1

ఇది జరిగిన తరువాత యూదా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవాయొద్ద విచారణచేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను.నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను.

2 సమూయేలు 2:11

దావీదు హెబ్రోనులో యూదావారిమీద ఏలినకాలమంతయు ఏడు సంవత్సరములు ఆరు మాసములు.

Zoan
కీర్తనల గ్రంథము 78:12

ఐగుప్తుదేశములోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్యకార్యములను చేసెను.

కీర్తనల గ్రంథము 78:43

ఐగుప్తులో తన సూచకక్రియలను సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికితెచ్చుకొనలేదు .

యెషయా 19:11

ఫరోయొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు సోయను అధిపతులు కేవలము అవివేకులైరి. ఆలోచనశక్తి పశుప్రాయమాయెను నేను జ్ఞాని కుమారుడను పూర్వపురాజుల కుమారుడనని ఫరోతో మీరెట్లు చెప్పుదురు?

యెషయా 30:4

యాకోబువారి అధిపతులు సోయనులో కనబడునప్పుడు వారి రాయబారులు హానేసులో ప్రవేశించునప్పుడు