రూబేను పాళెపు ధ్వజము వారి సేనలచొప్పున దక్షిణ దిక్కున ఉండవలెను. షెదేయూరు కుమారుడైన ఏలీసూరు రూబేను కుమారులకు ప్రధానుడు.
నాలుగవ దినమున అర్పణమును తెచ్చినవాడు షెదేయూరు కుమారుడును రూబేనీయులకు ప్రధానుడునైన ఏలీసూరు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండిగిన్నెను
రూబేనీయుల పాళెము ధ్వజము వారి సేనలచొప్పున సాగెను. ఆ సైన్యమునకు షెదేయూరు కుమారుడైన ఏలీసూరు అధిపతి.
లేయా గర్భవతియై కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను.
ఆమె మరల గర్భవతియై కుమారుని కని - నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతని కూడ నాకు దయచేసెననుకొని అతనికి షిమ్యోను అను పేరు పెట్టెను.
ఆమె మరల గర్భవతియై కుమారుని కని - తుదకు ఈ సారి నా పెనిమిటి నాతో హత్తుకొని యుండును; అతనికి ముగ్గురు కుమారులను కంటిననుకొనెను. అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను.
ఆమె మరల గర్భవతియై కుమారుని కని - ఈ సారి యెహోవాను స్తుతించెదననుకొని యూదా అను పేరు పెట్టెను. అప్పుడామెకు కానుపు ఉడిగెను.
బిల్హా గర్భవతియై యాకోబునకు కుమారుని కనెను.
అప్పుడు రాహేలు - దేవుడు నాకు తీర్పు తీర్చెను; ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసెననుకొని అతనికి దాను అని పేరు పెట్టెను.
రాహేలు దాసియైన బిల్హా తిరిగి గర్భవతియై యాకోబుకు రెండవ కుమారుని కనెను.
అప్పుడు రాహేలు - దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిననుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను.
లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసియైన జిల్పాను తీసికొని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను.
లేయా దాసియైన జిల్పా యాకోబునకు కుమారుని కనగా
లేయా - ఇది అదృష్టమేగదా అనుకొని అతనికి గాదు అను పేరుపెట్టెను.
లేయా దాసియైన జిల్పా యాకోబునకు రెండవ కుమారుని కనగా
లేయా నేను భాగ్యవంతురాలను - స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు గదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టెను.
గోధుమల కోతకాలములో రూబేను వెళ్లి పొలములో పుత్రదాతవృక్షపు పండ్లు చూచి తన తల్లియైన లేయాకు తెచ్చి యిచ్చెను. అప్పుడు రాహేలు - నీ కుమారుని పుత్ర దాతవృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయుమని లేయాతో అనగా
ఆమె - నా భర్తను తీసికొంటివే అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాతవృక్షపు పండ్లను తీసికొందువా అని చెప్పెను. అందుకు రాహేలు - కాబట్టి నీ కుమారుని పుత్రదాతవృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పెను.
సాయంకాలమందు యాకోబు పొలమునుండి వచ్చునప్పుడు లేయా అతనిని ఎదుర్కొన బోయి - నీవు నా యొద్దకు రావలెను, నా కుమారుని పుత్రదాతవృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పెను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను.
దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతియై యాకోబునకు అయిదవ కుమారుని కనెను.
లేయా - నేను నా పెనిమిటికి నా దాసి నిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసెననుకొని అతనికి ఇశ్శాఖారు అను పేరు పెట్టెను.
లేయా మరల గర్భవతియై యాకోబునకు ఆరవ కుమారుని కనెను.
అప్పుడు లేయా - దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను; నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయుననుకొని అతనికి జెబూలూను అను పేరు పెట్టెను.
ఆమె ప్రసవమువలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకుము; ఇదియు నీకు కుమారుడగునని చెప్పెను.
ఆమె మృతిబొందెను; ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను; అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను.
అట్లు రాహేలు మృతిబొంది బేత్లెహేమను ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను.
యాకోబు ఆమె సమాధిమీద ఒక స్తంభము కట్టించెను. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము.
ఇశ్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దల్ ఏదెరు కవతల తన గుడారము వేసెను.
ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉపపత్నియైన బిల్హాతో శయనించెను; ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను.
యాకోబు కుమారులు పండ్రెండుగురు, యాకోబు జ్యేష్ఠకుమారుడగు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను; వీరు లేయా కుమారులు.
రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను.
రాహేలు దాసియైన బిల్హా కుమారులు దాను, నఫ్తాలి.
లేయా దాసియైన జిల్పా కుమారులు గాదు, ఆషేరు వీరు పద్దనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు.
యాకోబును అతని కుమారులును ఐగుప్తునకు వచ్చిరి. ఇశ్రాయేలు కుమారుల పేళ్లు ఇవే;
యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను. రూబేను కుమారులైన హనోకు పల్లు హెస్రోను కర్మీ.
షిమ్యోను కుమారులైన యెమూయేలు యామీను ఓహదు యాకీను సోహరు కనానీయురాలి కుమారుడైన షావూలు.
లేవి కుమారులైన గెర్షోను కహాతు మెరారి
యూదా కుమారులైన ఏరు ఓనాను షేలా పెరెసు జెరహు. ఆ ఏరును ఓనానును కనాను దేశములో చనిపోయిరి. పెరెసు కుమారులైన హెస్రోను హామూలు.
ఇశ్శాఖారు కుమారులైన తోలా పువ్వా యోబు షిమ్రోను.
జెబూలూను కుమారులైన సెరెదు ఏలోను యహలేలు.
వీరు లేయా కుమారులు. ఆమె పద్దనరాములో యాకోబు వారిని అతని కుమార్తెయైన దీనాను కనెను. అతని కుమారులును అతని కుమార్తెలును అందరును ముప్పది ముగ్గురు.
గాదు కుమారులైన సిప్యోనుspan class="dict_num" for="H">H హగ్గీ షూనీ ఎస్బోను ఏరీ ఆరోదీ అరేలీ.
ఆషేరు కుమారులైన ఇమ్నా ఇష్వా ఇష్వీ బెరీయా; వారి సహోదరియైన శెరహు. ఆ బెరీయా కుమారులైన హెబెరు మల్కీయేలు.
లాబాను తన కుమార్తెయైన లేయా కిచ్చిన జిల్పా కుమారులు వీరే. ఆమె యీ పదునారు మందిని యాకోబునకు కనెను.
యాకోబు భార్యయైన రాహేలు కుమారులైన యోసేపు బెన్యామీను.
యోసేపునకు మనష్షే ఎఫ్రాయిములు పుట్టిరి. వారిని ఐగుప్తుదేశమందు ఓనుకు యాజకుడగు పోతీఫెర కుమార్తెయైన ఆసెనతు అతనికి కనెను.
బెన్యామీను కుమారులైన బెల బేకెరు అష్బేలు గెరా నయమాను ఏహీ రోషు ముప్పీము హుప్పీము ఆర్దు.
యాకోబునకు రాహేలు కనిన కుమారులగు వీరందరు పదునలుగురు.
దాను కుమారుడైన హుషీము.
నఫ్తాలి కుమారులైన యహనేలు గూనీ యేసెరు షిల్లేము.
యాకోబు తన కుమారులను పిలిపించి యిట్లనెను. మీరుకూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేసెదను.
యాకోబు కుమారులారా, కూడివచ్చి ఆలకించుడి మీ తండ్రియైన ఇశ్రాయేలు మాట వినుడి.
రూబేనూ, నీవు నా పెద్ద కుమారుడవు నా శక్తియు నా బలముయొక్క ప్రథమఫలమును ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే.
నీళ్లవలె చంచలుడవై నీవు అతిశయము పొందవు నీ తండ్రి మంచముమీది కెక్కితివి దానిని అపవిత్రము చేసితివి అతడు నా మంచముమీది కెక్కెను.
షిమ్యోను లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు.
నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా, వారి సంఘముతో కలిసికొనవద్దు వారు, కోపమువచ్చి మనుష్యులను చంపిరి తమ స్వేచ్ఛచేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి.
వారికోపము వేండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి శపింపబడును యాకోబులో వారిని విభజించెదను ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను.
యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడమీద ఉండును నీ తండ్రి కుమారులు నీ యెదుట సాగిలపడుదురు.
యూదా కొదమ సింహము నా కుమారుడా, నీవు పట్టినదాని తిని వచ్చితివి సింహమువలెను గర్జించు ఆడు సింహమువలెను అతడు కాళ్లు ముడుచుకొని పండుకొనెను అతని లేపువాడెవడు?
షిలోహు వచ్చువరకు యూదా యొద్దనుండి దండము తొలగదు అతని కాళ్ల మధ్యనుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులైయుందురు.
ద్రాక్షావల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిదపిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును.
అతని కన్నులు ద్రాక్షారసముచేత ఎఱ్ఱగాను అతని పళ్లు పాలచేత తెల్లగాను ఉండును.
జెబూలూను సముద్రపు రేవున నివసించును అతడు ఓడలకు రేవుగా ఉండును అతని పొలిమేర సీదోనువరకు నుండును.
ఇశ్శాఖారు రెండు దొడ్ల మధ్యను పండుకొనియున్న బలమైన గార్దభము.
అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి రమ్యమైనదగుటయు చూచెను గనుక అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టిచేయు దాసుడగును.
దాను ఇశ్రాయేలు గోత్రికులవలె తన ప్రజలకు న్యాయము తీర్చును.
దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. అది గుఱ్ఱపు మడిమెలు కరచును అందువలన ఎక్కువాడు వెనుకకు పడును.
యెహోవా, నీ రక్షణకొరకు కనిపెట్టియున్నాను.
బంటుల గుంపు గాదును కొట్టును అతడు మడిమెను కొట్టును.
ఆషేరునొద్ద శ్రేష్ఠమైన ఆహారము కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును.
నఫ్తాలి విడువబడిన లేడి అతడు ఇంపైనమాటలు పలుకును.
యోసేపు ఫలించెడి కొమ్మ ఊట యొద్ద ఫలించెడి కొమ్మ దాని రెమ్మలు గోడమీదికి ఎక్కి వ్యాపించును.
విలుకాండ్రు అతని వేధించిరి వారు బాణములను వేసి అతని హింసించిరి.
యాకోబు కొలుచు పరాక్రమశాలియైనవాని హస్తబలమువలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవునివలనను పైనుండి మింటి దీవెనలతోను
క్రింద దాగియున్న అగాధజలముల దీవెనలతోను స్తనముల దీవెనలతోను గర్భముల దీవెనలతోను నిన్ను దీవించు సర్వశక్తుని దీవెనవలనను అతని బాహుబలము దిట్టపరచబడును
నీ తండ్రి దీవెనలు నా పూర్వికుల దీవెనలపైని చిరకాల పర్వతములకంటె హెచ్చుగ ప్రబలమగును. అవి యోసేపు తలమీదను తన సహోదరులనుండి వేరుపరచబడిన వాని నడినెత్తిమీదను ఉండును.
బెన్యామీను చీల్చునట్టి తోడేలు అతడు ఉదయమందు ఎరను తిని అస్తమయమందు దోపుడుసొమ్ము పంచుకొనును.
ఇవి అన్నియు ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములు. వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది యిదే. ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను.
తరువాత అతడు వారి కాజ్ఞాపించుచు ఇట్లనెను నేను నా స్వజనులయొద్దకు చేర్చబడుచున్నాను.
హిత్తీయుడైన ఎఫ్రోను భూమియందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కనాను దేశమందలి మమ్రే యెదుటనున్న మక్పేలా పొలములో ఉన్నది. అబ్రాహాము దానిని ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రోనుయొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొనెను.
అక్కడనే వారు అబ్రాహామును అతని భార్యయైన శారాను పాతిపెట్టిరి; అక్కడనే ఇస్సాకును అతని భార్యయైన రిబ్కాను పాతిపెట్టిరి; అక్కడనే నేను లేయాను పాతిపెట్టితిని.
ఆ పొలమును అందులోనున్న గుహయు హేతు కుమారుల యొద్ద కొనబడినదనెను.
యాకోబు తన కుమారుల కాజ్ఞాపించుట చాలించి మంచముమీద తన కాళ్లు ముడుచుకొని ప్రాణమువిడిచి తన స్వజనులయొద్దకు చేర్చబడెను.
దాను నఫ్తాలి గాదు ఆషేరు.
వీరిలో ప్రతివాడును తన తన కుటుంబముతో వచ్చెను.
యాకోబు గర్భమున పుట్టినవారందరు డెబ్బదిమంది.
అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను.
దైవజనుడైన మోషే మృతినొందకమునుపు అతడు ఇశ్రాయేలీయులను దీవించిన విధము ఇది; అతడిట్లనెను యెహోవా సీనాయినుండి వచ్చెను
శేయీరులోనుండి వారికి ఉదయించెను ఆయన పారాను కొండనుండి ప్రకాశించెను వేవేల పరిశుద్ద సమూహముల మధ్యనుండి ఆయన వచ్చెను ఆయన కుడిపార్శ్వమున అగ్నిజ్వాలలు మెరియుచుండెను.
ఆయన జనములను ప్రేమించును ఆయన పరిశుద్ధులందరు నీ వశమున నుందురు వారు నీ పాదములయొద్ద సాగిలపడుదురు నీ ఉపదేశమును అంగీకరింతురు.
మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను అది యాకోబు సమాజ స్వాస్థ్యము.
జనులలో ముఖ్యులును ఇశ్రాయేలు గోత్రములును కూడగా అతడు యెషూరూనులో రాజు ఆయెను.
రూబేను బ్రదికి చావక యుండునుగాక అతనివారు లెక్కింపలేనంతమంది అగుదురు.
యూదానుగూర్చి అతడిట్లనెను యెహోవా, యూదా మనవి విని, అతని ప్రజల యొద్దకు అతనిని చేర్చుము. యూదా బాహుబలము అతనికి చాలునట్లుచేసి అతని శత్రువులకు విరోధముగా నీవతనికి సహాయుడవై యుందువు.
లేవినిగూర్చి యిట్లనెను నీ తుమీ్మము నీ ఊరీము నీ భక్తునికి కలవు మస్సాలో నీవు అతని పరిశోధించితివి మెరీబా నీళ్లయొద్ద అతనితో వివాదపడితివి.
అతడు నేను వానినెరుగనని తన తండ్రినిగూర్చియు తన తల్లినిగూర్చియు అనెను తన సహోదరులను లక్ష్యపెట్టలేదు తన కుమారులను కుమారులని యెంచలేదు వారు నీ వాక్యమునుబట్టి నీ నిబంధనను గైకొనిరి.
వారు యాకోబునకు నీ విధులను ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు నీ సన్నిధిని ధూపమును నీ బలిపీఠముమీద సర్వాంగబలిని అర్పించుదురు
యెహోవా, అతని బలమును అంగీకరించుము అతడు చేయు కార్యమును అంగీకరించుమీ అతని విరోధులును అతని ద్వేషించువారును లేవకుండునట్లు వారి నడుములను విరుగగొట్టుము.
బన్యామీనునుగూర్చి యిట్లనెను బెన్యామీను యెహోవాకు ప్రియుడు ఆయనయొద్ద అతడు సురక్షితముగా నివసించును దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయమగును ఆయన భుజములమధ్య అతడు నివసించును
యోసేపునుగూర్చి యిట్లనెను ఆకాశ పరమార్థములవలన మంచువలన క్రింద క్రుంగియున్న అగాధ జలములవలన
సూర్యునివలన కలుగు ఫలములోని శ్రేష్ఠపదార్థములవలన చంద్రుడు పుట్టించు శ్రేష్ఠపదార్థములవలన
పురాతన పర్వతముల శ్రేష్ఠపదార్థములవలన నిత్యపర్వతముల శ్రేష్ఠపదార్థములవలన
సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠపదార్థములవలన యెహోవా అతని భూమిని దీవించును పొదలోనుండినవాని కటాక్షము యోసేపు తలమీదికి వచ్చును తన సహోదరులలో ప్రఖ్యాతినొందినవాని నడినెత్తి మీదికి అది వచ్చును.
అతని వృషభమునకు మొదట పుట్టినదానికి ఘనత కలదు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు వాటివలన అతడు భూమ్యంతములవరకు జనులను త్రోసివేయును ఎఫ్రాయిముయొక్క పదివేలును మనష్షేయొక్క వేలును ఆలాగున నుందురు.
జబూలూనునుగూర్చి యిట్లనెను జెబూలూనూ, నీవు బయలు వెళ్లు స్థలమందు సంతోషించుము ఇశ్శాఖారూ, నీ గుడారములయందు సంతోషించుము.
వారు జనములను కొండకు పిలిచిరి అక్కడ నీతి బలుల నర్పింతురు వారు సముద్రముల సమృద్ధిని ఇసుకలో దాచబడిన రహస్యద్రవ్యములను పీల్చుదురు.
గాదునుగూర్చి యిట్లనెను గాదును విశాలపరచువాడు స్తుతింపబడును అతడు ఆడు సింహమువలె పొంచియుండును బాహువును నడినెత్తిని చీల్చివేయును.
అతడు తనకొరకు మొదటిభాగము చూచుకొనెను అక్కడ నాయకుని భాగము కాపాడబడెను. అతడు జనములోని ముఖ్యులతో కూడ వచ్చెను యెహోవా తీర్చిన న్యాయమును జరిపెను ఇశ్రాయేలీయులయొద్ద యెహోవా విధులను ఆచరించెను.
దానునుగూర్చి యిట్లనెను దాను సింహపుపిల్ల అది బాషానునుండి దుమికి దాటును.
నఫ్తాలినిగూర్చి యిట్లనెను కటాక్షముచేత తృప్తిపొందిన నఫ్తాలి, యెహోవా దీవెనచేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనుము.
ఆషేరునుగూర్చి యిట్లనెను ఆషేరు తన సహోదరులకంటె ఎక్కువగా ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరులకంటె కటాక్షము నొందును తన పాదములను తైలములో ముంచుకొనును.
నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునై యుండును.నీవు బ్రదుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును.
యెషూరూనూ, దేవుని పోలినవాడెవడును లేడు ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును మహోన్నతుడై మేఘవాహనుడగును.
శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము నిత్యముగనుండు బాహువులు నీ క్రిందనుండును ఆయన నీ యెదుటనుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను.
ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును యాకోబు ఊట ప్రత్యేకింపబడును అతడు ధాన్య ద్రాక్షారసములుగల దేశములో నుండును అతనిపై ఆకాశము మంచును కురిపించును.
ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు నీవు వారి ఉన్నతస్థలములను త్రొక్కుదువు.
మరియు ముద్రింపబడినవారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింపబడినవారు లక్ష నలువది నాలుగు వేలమంది.
యూదా గోత్రములో ముద్రింపబడినవారు పండ్రెండు వేలమంది. రూబేను గోత్రములో పండ్రెండు వేలమంది, గాదు గోత్రములో పండ్రెండు వేలమంది,
ఆషేరు గోత్రములో పండ్రెండు వేలమంది, నఫ్తాలి గోత్రములో పండ్రెండు వేలమంది, మనష్షే గోత్రములో పండ్రెండు వేలమంది,
షిమ్యోను గోత్రములో పండ్రెండు వేలమంది, లేవి గోత్రములో పండ్రెండు వేలమంది, ఇశ్శాఖారు గోత్రములో పండ్రెండు వేలమంది,
జెబూలూను గోత్రములో పండ్రెండు వేలమంది, యోసేపు గోత్రములో పండ్రెండు వేలమంది, బెన్యామీను గోత్రములో పండ్రెండు వేలమంది ముద్రింపబడిరి.