
యెరూషలేము లో నివసించుటకై వారిని తోడుకొని వచ్చెదను, వారు నా జనులై యుందురు, నేను వారికి దేవుడనై యుందును; ఇది నీతి సత్యములనుబట్టి జరుగును.
సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా -సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరమును కట్టుటకై దాని పునాదివేసిన దినమున ప్రవక్తల నోట పలుకబడిన మాటలు ఈ కాలమున వినువారలారా, ధైర్యము తెచ్చుకొనుడి.
ఆయన ఎల్లప్పుడు వ్యాజ్యెమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు.
ఎఫ్రాయిమునకున్న మత్సరము పోవును యూదా విరోధులు నిర్మూలమగుదురు ఎఫ్రాయిము యూదాయందు మత్సరపడడు యూదా ఎఫ్రాయిమును బాధింపడు
ఆ దినమున మీరీలాగందురు యెహోవా, నీవు నామీద కోపపడితివి నీ కోపము చల్లారెను నిన్ను స్తుతించుచున్నాను నీవు నన్ను ఆదరించియున్నావు.
కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్షచెట్లయినను అంజూరపుచెట్లయినను దానిమ్మచెట్లయినను ఒలీవచెట్లయినను ఫలించకపోయెను గదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను.
ఈ జను లందరును నాయొద్ద దొంగిలుచునే యున్నారు, మీరు శాపగ్రస్తులై యున్నారు.
నా మందిరము లో ఆహార ముండునట్లు పదియవభాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి; దీని చేసి మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి,పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు, మీ ద్రాక్షచెట్లు అకాలఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు