యెత్తున
యోబు గ్రంథము 20:6

వారి ఘనత ఆకాశమంత యెత్తుగా పెరిగినను మేఘములంత యెత్తుగా వారు తలలెత్తినను

యోబు గ్రంథము 20:7

తమ మలము నశించు రీతిగా వారెన్నటికిని నుండకుండ నశించుదురు.వారిని చూచినవారు వారేమైరని యడుగుదురు.

యోబు గ్రంథము 39:27

పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశవీధికెక్కునా? తన గూడు ఎత్తయినచోటను కట్టుకొనునా?

యోబు గ్రంథము 39:28

అది రాతికొండమీద నివసించును కొండపేటుమీదను ఎవరును ఎక్కజాలని యెత్తు చోటను గూడు కట్టుకొనును.

యిర్మీయా 49:16

నీవు భీకరుడవు; కొండసందులలో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరచుకొనువాడా, నీ హృదయగర్వము నిన్ను మోసపుచ్చెను, నీవు పక్షిరాజువలె నీ గూటిని ఉన్నత స్థలములో కట్టుకొనినను అక్కడనుండి నిన్ను క్రింద పడద్రోసెదను; ఇదే యెహోవా వాక్కు.

హబక్కూకు 2:9

తనకు అపాయము రాకుండునట్లు తన నివాసమును బలపరచుకొని, తన యింటివారికొరకై అన్యాయముగా లాభము సంపాదించుకొనువానికి శ్రమ.

నక్షత్రములలో
యెషయా 14:12-15
12

తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి?

13

నేను ఆకాశమున కెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును

14

మేఘమండలముమీది కెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివిగదా?

15

నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే.

యిర్మీయా 51:53

బబులోను తన బలమైన ఉన్నతస్థలములను దుర్గములుగా చేసికొని ఆకాశమునకు ఎక్కినను పాడుచేయువారు నాయొద్దనుండి వచ్చి దానిమీద పడుదురు ఇదే యెహోవా వాక్కు.

ఆమోసు 9:2

వారు పాతాళములో చొచ్చి పోయినను అచ్చటనుండి నా హస్తము వారిని బయటికి లాగును ; ఆకాశమున కెక్కి పోయినను అచ్చటనుండి వారిని దింపి తెచ్చెదను.