అయినను లోలోపల హృదయపూర్వకమైన భక్తిలేనివారు క్రోధము నుంచుకొందురు. ఆయన వారిని బంధించునప్పుడు వారు మొఱ్ఱపెట్టరు.
కావున వారు యవనమందే మృతినొందుదురు వారి బ్రదుకు పురుషగాముల బ్రదుకువంటిదగును.
వారు సమాధులలో కూర్చుండుచు రహస్యస్థలములలో ప్రవేశించుచు పందిమాంసము తినుచుందురు అసహ్యపాకములు వారి పాత్రలలో ఉన్నవి
ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన యిద్దరు మనుష్యులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్లలేక పోయెను.
అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండును.
వారిలో హుమెనైయును అలెక్సంద్రును ఉన్నారు; వీరు దూషింపకుండ శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించితిని.
కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంతకులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.