మూడవ
దానియేలు 7:1

బబులోను రాజగు బెల్షస్సరుయొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనములు కలిగెను; అతడు తన పడక మీద పరుండి యొక కల కని ఆ కల సంగతిని సంక్షేపముగా వివరించి వ్రాసెను .

దానియేలను నాకు
దానియేలు 8:15

దానియేలను నేను ఈ దర్శనము చూచితిని ; దాని తెలిసికొనదగిన వివేకము పొందవలెనని యుండగా; మనుష్యుని రూపముగల యొకడు నాయెదుట నిలిచెను .

దానియేలు 7:15

నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరచుచున్నందున దానియేలను నేను నా దేహము లో మనోదుఃఖము గలవాడనైతిని.

దానియేలు 7:28

దానియేలను నేను విని మనస్సునందు అధికమైన కలతగలవాడనైతిని ; అందుచేత నా ముఖము వికారమాయెను ; అయితే ఆ సంగతి నా మనస్సులో నుంచుకొంటిని .

దానియేలు 9:2

అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు, యెరూషలేము పాడుగా ఉండవలసిన డెబ్బది సంవత్సరములు సంపూర్తియౌచున్నవని గ్రంథములవలన గ్రహించితిని .

దానియేలు 10:2

ఆ దినములయందు దానియేలను నేను మూడు వారములు దుఃఖ ప్రాప్తుడనైతిని .

దానియేలు 10:7

దానియేలను నాకు ఈ దర్శనము కలుగగా నాతోకూడ నున్న మనుష్యులు దాని చూడ లేదు గాని మిగుల భయాక్రాంతులై దాగుకొనవలెనని పారిపోయిరి .

దానియేలు 11:4

అతడు రాజైనతరువాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలు దిక్కుల విభాగింపబడును . అది అతని వంశపువారికి గాని అతడు ప్రభుత్వము చేసిన ప్రకారము ప్రభుత్వము చేయువారికి గాని విభాగింపబడదు , అతని ప్రభుత్వము వేరుతో పెరికివేయబడును , అతని వంశపువారు దానిని పొందరు గాని అన్యులు పొందుదురు.