యూదులలోనుండి దానియేలు , హనన్యా , మిషాయేలు , అజర్యా అనువారు వీరిలోనుండిరి .
కావున అర్యోకు రాజునకు భావము తెలియజెప్పగల యొక మనుష్యుని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటి నని రాజు సముఖమున మనవిచేసి, దానియేలును త్వరగా రాజుసన్నిధికి తోడుకొనిపోయెను .
అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి . అతడు రాగా రాజు ఇట్లనెను -రాజగు నా తండ్రి యూదయలో నుండి ఇక్కడికి తీసికొనివచ్చిన చెర సంబంధమగు యూదులలోనుండు దానియేలు నీవే గదా?
రాజా , తాము షద్రకు , మేషాకు , అబేద్నగో అను ముగ్గురు యూదులను బబులోను దేశములోని రాచకార్యములు విచారించుటకు నియమించితిరి ; ఆ మనుష్యులు తమరి ఆజ్ఞను లక్ష్యపెట్ట లేదు , తమరి దేవతలను పూజించుట లేదు , తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనిరి.
అంతట హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా మీ రాజ్య సంస్థానములన్నిటియందుండు జనులలో ఒక జాతివారు చెదరియున్నారు; వారి విధులు సకలజనుల విధులకు వేరుగా ఉన్నవి; వారు రాజుయొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు; కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు.
అందుకు పేతురును అపొస్తలులును మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా.
వీరందరు యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి, కైసరు చట్టములకు విరోధముగా నడుచుకొనువారు అని కేకలువేసిరి.