
నేను అతని మాటలు వింటిని ; అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢనిద్ర పొందినవాడనైతిని.
అతడు నాతో మాటలాడుచుండగా నేను గాఢనిద్రపట్టినవాడనై నేలను సాష్టాంగపడితిని గనుక అతడు నన్ను పట్టుకొని లేవనెత్తి నిలువబెట్టెను .
నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొనునట్లు నీవు ఈ రీతిని వారికి సూచనగా ఉందువు.
తప్పించుకొనినవాడు వచ్చిన వెనుకటి సాయంత్రమున యెహోవా హస్తము నామీదికి వచ్చెను ; ఉదయమున అతడు నాయొద్దకు రాక మునుపే యెహోవా నా నోరు తెరవగా పలుకుటకు నాకు శక్తి కలిగెను, అప్పటినుండి నేను మౌనిని కాకయుంటిని .
మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును ; నీవు వాటిని నమ్మ లేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట లాడక మౌనివై యుందువని అతనితో చెప్పెను .