యూదావారి సరిహద్దునకును బెన్యామీనీయుల సరిహద్దునకును మధ్యగానున్న లేవీయుల స్వాస్థ్యమును పట్టణమునకు ఏర్పాటైన స్థానమును ఆనుకొను భూమిలో అధిపతి భూమికి లోగా ఉన్నది అధిపతి దగును.
వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటిమీద కాపరినిగా నియమించెదను, అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును.
యెహోవానైన నేను వారికి దేవుడనై యుందును, నా సేవకుడైన దావీదు వారిమధ్య అధిపతిగా ఉండును, యెహోవానైన నేను మాటయిచ్చియున్నాను.
నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారికందరికి కాపరి యొక్కడే యుండును, వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు.
మరియు ప్రతిష్ఠిత భాగమునకును పట్టణమునకై యేర్పడిన ప్రదేశమునకును ఎదురుగా వాటికి పడమటగాను తూర్పుగాను , ప్రతిష్ఠిత భాగమునకును పట్టణమునకై యేర్పడిన దేశమునకును ఇరుప్రక్కల అధిపతికి భూమి నేర్పాటుచేయవలెను. పడమటినుండి తూర్పు వరకు దాని కొలువగా అదియొక గోత్రస్థానమునకు సరిపడు నిడివిగలదై యుండవలెను. అధిపతి యిక నా జనులను బాధింపక వారి గోత్రములనుబట్టి భూమి అంతయు ఇశ్రాయేలీయులకు నియమించునట్లు
అది ఇశ్రాయేలీయులలో అతనికి భూస్వాస్థ్యముగా ఉండును .
యూదా వారును ఇశ్రాయేలు వారును ఏకముగా కూడుకొని, తమ పైన నొకనినే ప్రధానుని నియమించుకొని తామున్న దేశము లోనుండి బయలుదేరుదురు ; ఆ యెజ్రెయేలు దినము మహా ప్రభావముగల దినముగానుండును .