
దాని సమాధులు పాతాళాగాధములో నియమింపబడినవి, దాని సమూహము దాని సమాధి చుట్టు నున్నది, వారందరు సజీవుల లోకములో భయంకరులైన వారు, వారు కత్తి పాలై చచ్చిపడియుండిరి.
అక్కడ ఏలామును దాని సమూహమును సమాధి చుట్టు నున్నవి; అందరును కత్తి పాలై చచ్చిరి; వారు సజీవుల లోకములో భయంకరులైనవారు, వారు సున్నతిలేనివారై పాతాళము లోనికి దిగిపోయిరి, గోతిలోనికి దిగిపోయిన వారితో కూడ వారు అవమానము నొందుదురు.
హతులైన వారిమధ్య దానికిని దాని సమూహమునకును పడకయొకటి ఏర్పడెను, దాని సమాధులు దానిచుట్టు నున్నవి; వారందరును సున్నతిలేనివారై హతులైరి; వారు సజీవుల లోకములో భయంకరులు గనుక గోతిలోనికి దిగిపోయినవారితో కూడ వారును అవమానము నొందుదురు, హతులైన వారిమధ్య అది యుంచబడును.
అక్కడ మెషెకును తుబాలును దాని సమూహమును ఉన్నవి; దాని సమాధులు దాని చుట్టునున్నవి. వారందరు సున్నతిలేనివారు, సజీవుల లోకములో వారు భయంకరు లైరి గనుక వారు కత్తిపాలైరి, ఆయుధములను చేతపట్టుకొని పాతాళములోనికి దిగిపోయిరి.
కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నేను నీమీదికి ఖడ్గము రప్పించి, మనుష్యులను పశువులను నీలోనుండి నిర్మూలము చేసెదను,
ఐగుప్తు దేశము నిర్మానుష్యమై పాడుగా ఉండును, అప్పుడు నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు. నైలునది నాది, నేనే దాని కలుగజేసితినని అతడనుకొనుచున్నాడు గనుక
నేను నీకును నీ నదికిని విరోధినైతిని, ఐగుప్తు దేశమును మిగ్దోలు మొదలుకొని సెవేనేవరకు కూషు సరిహద్దు వరకు బొత్తిగా పాడుచేసి యెడారిగా ఉంచెదను.
దానిలో మనుష్యులు సంచ రించరు, పశువులు తిరు గవు; నలువది సంవత్సరములు అది నిర్నివాసముగా ఉండును.
నిర్మానుష్యముగానున్న దేశముల మధ్యను ఐగుప్తు దేశమును పాడగునట్టుగా చేసెదను, పాడై పోయిన పట్టణముల మధ్యను దాని పట్టణములు నలువది సంవత్సరములు పాడై యుండును, ఐగుప్తీయులను జనముల లోనికి చెదరగొట్టుదును, ఆ యా దేశములకు వారిని వెళ్లగొట్టుదును.
భక్తిహీనులను, పాపము చేయువారిని నీవు లాగివేయునట్టు నన్ను లాగి వేయకుము. వారు దుష్టాలోచన హృదయములో నుంచుకొని తమ పొరుగువారితో సమాధానముగా మాటలాడుదురు
చావునకై పట్టబడినవారిని నీవు తప్పించుము నాశమునందు పడుటకు జోగుచున్నవారిని నీవు రక్షింపవా?
అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఈడువబడి పారవేయబడి గాడిద పాతిపెట్టబడురీతిగా పాతిపెట్టబడును.