
కావున ఒహొలీబా , ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నీ మనస్సునకు ఎడమైపోయిన నీ విటకాండ్రను రేపి నలుదిక్కులు వారిని నీమీదికి రప్పించెదను .
గుఱ్ఱముల నెక్కు బబులోనువారిని కల్దీయులను అధిపతులను ప్రధానాధికారులనందరిని అష్షూరీయులను సౌందర్యముగల శ్రేష్ఠులను అధిపతులను అధికారులను శూరులను మంత్రులను అందరిని నీమీదికి నేను రప్పించుచున్నాను.
ఆయుధములు పట్టుకొని చక్రములుగల రథములతోను గొప్ప సైన్యముతోను వారు నీమీదికి వచ్చి , కేడెములను డాళ్లను పట్టుకొని శిరస్త్రాణములు ధరించుకొని వారు నీమీదికి వచ్చి నిన్ను చుట్టుకొందురు , వారు తమ మర్యాదచొప్పున నిన్ను శిక్షించునట్లు నేను నిన్ను గూర్చిన తీర్పు వారికప్పగింతును .
ఉగ్రతతో వారు నిన్ను శిక్షించునట్లు నా రోషము నీకు చూపుదును , నీ చెవులను నీ ముక్కును వారు తెగగోయుదురు , నీలో శేషించినవారు ఖడ్గముచేత కూలుదురు , నీ కుమారులను నీ కుమార్తెలను వారు పట్టుకొందురు , నీలో శేషించిన వారు అగ్నిచేత దహింపబడుదురు .
నీ బట్టలను లాగివేసి నీ సొగసైన నగలను అపహరించుదురు .
వారు నీమీదికి సమూహములను రప్పించి నిన్ను రాళ్లతో కొట్టి చంపుదురు, కత్తులచేత నిన్ను పొడిచి వేయుదురు.
ఈ దేశముమీదికిని దీని నివాసుల మీదికిని చుట్టునున్న యీ జనులందరి మీదికిని వారిని రప్పించుచున్నాను; ఈ జనులను శాపగ్రస్తులగాను విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికిని పాడుగాను ఉండజేసెదను.
యూదారాజైన హిజ్కియా కుమారుడగు మనష్షే యెరూషలేములో చేసిన క్రియలనుబట్టి భూమిమీదనున్న సకల రాజ్యములలోనికి యిటు అటు చెదరగొట్టబడునట్లు వారిని అప్పగించుచున్నాను.
మరియు వారు యిటు అటు చెదరగొట్టబడుటకై భూ రాజ్యములన్నిటిలోను, నేను వారిని తోలివేయు స్థలములన్నిటిలోను, వారిని భీతికరముగాను నిందాస్పదముగాను సామెతగాను అపహాస్యముగాను శాపాస్పదముగాను ఉండజేసెదను.
కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఒక్కొక్కడు తన సహోదరులకును తన పొరుగువారికిని విడుదల ప్రకటింపవలెనని నేను చెప్పిన మాట మీరు వినకపోతిరే; ఆలోచించుడి, విడుదల కావలెనని నేనే చాటించుచున్నాను, అది ఖడ్గ క్షామసంకటముల పాలగుటకైన విడుదలయే; భూరాజ్యము లన్నిటిలోను ఇటు అటు చెదరగొట్టుటకు మిమ్ము నప్పగించుచున్నాను.