
అవి జరుగునప్పుడు నాలుగు ప్రక్కలకు జరుగుచుండెను, వెనుకకు తిరుగకయే జరుగుచుండెను.
వాటి కైవారములు మిక్కిలి యెత్తుగలవై భయంకరముగా ఉండెను, ఆ నాలుగు కైవారములు చుట్టు కండ్లతో నిండి యుండెను.
ఆ జీవులు కదలగా ఆ చక్రములును వాటి ప్రక్కను జరిగెను, అవి నేల నుండి లేచినప్పుడు చక్రములుకూడ లేచెను.
ఆత్మ యెక్కడికి పోవునో అక్కడికే, అది పోవలసిన వైపునకే అవియు పోవుచుండెను; జీవికున్న ఆత్మ, చక్రములకును ఉండెను గనుక అవి లేవగానే చక్రములును లేచుచుండెను.
జీవికున్న ఆత్మ చక్రములకును ఉండెను గనుక జీవులు జరుగగా చక్రములును జరుగుచుండెను, అవి నిలువగా ఇవియు నిలిచెను, అవి నేల నుండి లేవగా ఇవియు వాటితోకూడ లేచెను.
కెరూబులు తమ రెక్కలు చాచెను, చక్రములును వాటి ప్రక్కనుండెను అంతలో ఇశ్రాయేలీయుల దేవుని మహిమ వాటికి పైన నుండెను.
మరియు యెహోవా మహిమ పట్టణము లోనుండి పైకెక్కి పట్టణపు తూర్పుదిశనున్న కొండకు పైగా నిలిచెను.
యెహోవా మందిరపు లోపలి ఆవరణములో నన్ను దింపగా, అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖమంటపమునకును బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు ఇరువది యయిదుగురు మనుష్యులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును వారి ముఖములు తూర్పుతట్టును తిరిగి యుండెను; వారు తూర్పున నున్న సూర్యునికి నమస్కారము చేయుచుండిరి.
తూర్పు తట్టు చూచు గుమ్మపు మార్గమున యెహోవా తేజోమహిమ మందిరము లోనికి ప్రవేశించెను.
నేను చూచుచుండగా కెరూబులకు పైగానున్న ఆకాశమండలమువంటి దానిలో నీలకాంతమయమైన సింహాసనము వంటి దొకటి అగుపడెను.
వాటి తలల పైనున్న ఆ మండలము పైన నీల కాంతమయమైన సింహాసనము వంటి దొకటి కనబడెను; మరియు ఆ సింహాసనము వంటి దానిమీద నర స్వరూపియగు ఒకడు ఆసీనుడైయుండెను.
చుట్టు దాని లోపట కరుగుచున్న యిత్తడియు అగ్నియు నున్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదికిని నడుము మొదలు కొని దిగువకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను, చుట్టును తేజోమయముగా కనబడెను.
వర్ష కాలమున కనబడు ఇంద్ర ధనుస్సుయొక్క తేజస్సువలె దాని చుట్టునున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాటలాడు ఒకని స్వరము నాకు వినబడెను.