నీవు మమ్మును బొత్తిగా విసర్జించి యున్నావు నీ మహోగ్రత మామీద వచ్చినది
కీర్తనల గ్రంథము 44:9

అయితే ఇప్పుడు నీవు మమ్మును విడనాడి అవమానపరచియున్నావు. మాసేనలతోకూడ నీవు బయలుదేరకయున్నావు.

కీర్తనల గ్రంథము 60:1

దేవా, మమ్ము విడనాడియున్నావు మమ్ము చెదరగొట్టియున్నావు నీవు కోపపడితివి మమ్ము మరల బాగుచేయుము.

కీర్తనల గ్రంథము 60:2

నీవు దేశమును కంపింపజేసియున్నావు దానిని బద్దలు చేసియున్నావు అది వణకుచున్నది అది పడిపోయిన చోటులు బాగుచేయుము.

యిర్మీయా 15:1-5
1

అప్పుడు యెహోవా నాకీలాగు సెలవిచ్చెను మోషేయు సమూయేలును నాయెదుట నిలువబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు, నాసన్నిధి నుండకుండ వారిని వెళ్లగొట్టుము.

2

మే మెక్కడికి పోదుమని వారు నిన్నడిగినయెడల నీవు వారితో నిట్లనుము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడుచావునకు నియమింపబడినవారు చావునకును, ఖడ్గమునకు నియమింప బడినవారు ఖడ్గమునకును, క్షామమునకు నియమింపబడినవారు క్షామమునకును, చెరకు నియమింపబడినవారు చెరకును పోవలెను.

3

యెహోవా వాక్కు ఇదేచంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, తినివేయుటకును నాశనము చేయుటకును ఆకాశపక్షులు భూమృగములు అను ఈ నాలుగు విధముల బాధలు వారికి నియమించియున్నాను.

4

యూదారాజైన హిజ్కియా కుమారుడగు మనష్షే యెరూషలేములో చేసిన క్రియలనుబట్టి భూమిమీదనున్న సకల రాజ్యములలోనికి యిటు అటు చెదరగొట్టబడునట్లు వారిని అప్పగించుచున్నాను.

5

యెరూషలేమా, నిన్ను కరుణించువాడెవడు? నీయందు జాలిపడువాడెవడు? కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవవిడిచి నీయొద్దకు వచ్చును?

యెహెజ్కేలు 37:11

అప్పుడాయన నాతో ఇట్లనెను నరపుత్రుడా, ఈ యెముకలు ఇశ్రాయేలీయులనందరిని సూచించుచున్నవి. వారు మన యెముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతివిు అని యనుకొనుచున్నారు

హొషేయ 1:6

పిమ్మట ఆమె మరల గర్భవతియై కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా-దీనికి లోరూహామా అనగా జాలి నొందనిది అని పేరు పెట్టుము; ఇకమీదట నేను ఇశ్రాయేలు వారిని క్షమించను, వారియెడల జాలిపడను .