దాని ప్రాకారము లెక్కి నాశనముచేయుడి, అయినను నిశ్శేషముగా నాశనముచేయకుడి, దాని శాఖలను కొట్టి వేయుడి. అవి యెహోవావి కావు.
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఈదేశమంతయు పాడగును గాని నిశ్శేషముగా దాని నాశనము చేయను.
నేను తప్ప మరి ఎవరును శేషింపకుండ వారు హతము చేయుట నేను చూచి సాస్టాంగపడి వేడుకొని అయ్యో , ప్రభువా , యెహోవా , యెరూషలేము మీద నీ క్రోధమును కుమ్మరించి ఇశ్రాయేలీయులలో శేషించిన వారినందరిని నశింపజేయుదువా ? అని మొఱ్ఱ పెట్టగా
నేను ఆ ప్రకారము ప్రవచింపు చుండగా బెనాయా కుమారుడైన పెలట్యా చచ్చెను గనుక నేను సాష్టాంగపడి యెలుగెత్తి –అయ్యో , ప్రభువా , యెహోవా , ఇశ్రాయేలీయుల శేషమును నీవు నిర్మూలము చేయుదువా ? అని మొఱ్ఱపెట్టితిని .
ఆలాగైనయెడల నేనడుగునదేమనగా , దేవుడు తన ప్రజలను విసర్జించెనా ? అట్లనరాదు . నేను కూడ ఇశ్రాయేలీయుడను , అబ్రాహాము సంతాన మందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను.
తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింప లేదు . ఏలీయాను గూర్చిన భాగములో లేఖనము చెప్పునది మీరెరుగరా ?
ప్రభువా , వారు నీ ప్రవక్తలను చంపిరి , నీ బలిపీఠములను పడగొట్టిరి , నే నొక్కడనే మిగిలియున్నాను , నా ప్రాణము తీయ జూచుచున్నారు అని ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని యెదుట అతడు వాదించుచున్నాడు .
అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది ? బయలుకు మోకా ళ్లూనని యేడువేలమంది పురుషులను నేను శేషముగా నుంచుకొనియున్నాను.
ఆలాగుననే అప్పటి కాల మందు సయితము కృపయొక్క యేర్పాటు చొప్పున శేషము మిగిలి యున్నది .