అప్పుడు నీవు అణపబడి నేలనుండి పలుకుచుందువు నీ మాటలు నేలనుండి యొకడు గుసగుసలాడు నట్లుండును కర్ణపిశాచి స్వరమువలె నీ స్వరము నేలనుండి వచ్చును నీ పలుకు ధూళిలోనుండి గుసగుసలుగా వినబడును.
దీని చూచి నేను కేకలు వేయుచు ప్రలాపించుచున్నాను , ఏమియు లేకుండ దిగంబరినై నక్కలు అరచునట్లు అరచుచున్నాను . నిప్పుకోడి మూల్గునట్లు మూల్గుచున్నాను .
అన్యజనులు అది చూచి తమకు కలిగిన బల మంత కొంచెమని సిగ్గుపడి నోరు మూసి కొందురు . వారి చెవులు చెవుడెక్కిపోవును .
నీవు నాకు గండ్రగొడ్డలివంటివాడవు యుద్ధాయుధమువంటివాడవు నీవలన నేను జనములను విరుగగొట్టుచున్నాను నీవలన రాజ్యములను విరుగగొట్టుచున్నాను.
నీవలన గుఱ్ఱములను రౌతులను విరుగగొట్టుచున్నాను. నీవలన రథములను వాటి నెక్కినవారిని విరుగగొట్టుచున్నాను.
నీవలన స్త్రీలను పురుషులను విరుగగొట్టుచున్నాను నీవలన ముసలివారిని బాలురను విరుగగొట్టుచున్నాను నీవలన ¸యవనులను కన్యకలను విరుగగొట్టుచున్నాను.
నీవలన గొఱ్ఱలకాపరులను వారి గొఱ్ఱలమందలను విరుగగొట్టుచున్నాను నీవలన దున్నువారిని వారి దుక్కిటెద్దులను విరుగగొట్టుచున్నాను నీవలన ఏలికలను అధిపతులను విరుగగొట్టుచున్నాను.
గొడ్డలి తనతో నరుకువాని చూచి అతిశయపడునా? రంపము తనతో కోయువానిమీద పొగడుకొనునా? కోల తన్నెత్తువానిని ఆడించినట్లును దండము కఱ్ఱకానివానిని ఎత్తినట్లును ఉండును గదా?
చూడుడి ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా భీకరముగా కొమ్మలను తెగగొట్టగా మిక్కిలి యెత్తుగల చెట్లు నరకబడును ఉన్నతమైనవి పడిపోవును.
ఆయన అడవి పొదలను ఇనుపకత్తితో కొట్టివేయును లెబానోను బలవంతుడైన యొకనిచేత కూలిపోవును.
నిన్నుగూర్చి తమాలవృక్షములు లెబానోను దేవదారువృక్షములు హర్షించును
నీ దూతలచేత యెహోవాను తిరస్కరించి నీ వీలాగు పలికితివి నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరముల మీదికిని లెబానోను పార్శ్వములకును ఎక్కియున్నాను ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్ఠమైన సరళవృక్షములను నరికివేసియున్నాను వాని దూరపు సరిహద్దులలోనున్న సత్రములలోనికిని కర్మెలు ఫలవంతములగు క్షేత్రమైన అడవి లోనికిని ప్రవేశించియున్నాను.
దేవదారు వృక్షములు కూలెను , వృక్షరాజములు పాడైపోయెను ; సరళవృక్షములారా, అంగలార్చుడి చిక్కని అడవి నరకబడెను ; సింధూరవృక్షములారా, అంగలార్చుడి .