పట్టణములలోనుండియు
యిర్మీయా 32:44

నేను వారిలో చెరపోయినవారిని రప్పింపబోవుచున్నాను గనుక బెన్యామీను దేశములోను యెరూషలేము ప్రాంతములలోను యూదా పట్టణములలోను మన్యములోని పట్టణములలోను దక్షిణదేశపు పట్టణములలోను మనుష్యులు క్రయమిచ్చి పొలములు కొందురు, క్రయపత్రములు వ్రాయించుకొందురు, ముద్రవేయుదురు, సాక్షులను పెట్టుదురు; ఇదే యెహోవా వాక్కు.

యిర్మీయా 33:13

మన్నెపు పట్టణములలోను మైదానపు పట్టణములలోను దక్షిణదేశపు పట్టణములలోను బెన్యామీను దేశములోను యెరూషలేము ప్రాంత స్థలములలోను యూదా పట్టణములలోను మందలు లెక్క పెట్టువారిచేత లెక్కింపబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

యెహొషువ 15:21-63
21

దక్షిణదిక్కున ఎదోము సరిహద్దువరకు యూదా వంశస్థుల గోత్రముయొక్క పట్టణములు ఏవేవనగా–కబ్సెయేలు

22

ఏదెరు యాగూరు కీనా

23

దిమోనా అదాదా కెదెషు

24

హాసోరు యిత్నాను జీఫు

25

తెలెము బెయాలోతు క్రొత్త

26

హాసోరు కెరీయోతు హెస్రోను

27

అనబడిన హాసోరు అమాము

28

షేమ మోలాదా హసర్గద్దా హెష్మోను

29

బేత్పెలెతు హసర్షువలు బెయేర్షెబా

30

బిజ్యోత్యా బాలా ఈయ్యె ఎజెము

31

ఎల్తోలదు కెసీలు హోర్మా సిక్లగు మద్మన్నా

32

సన్సన్నా లెబాయోతు షిల్హిము అయీను రిమ్మోను అనునవి, వాటి పల్లెలు పోగా ఈ పట్టణములన్నియు ఇరువది తొమ్మిది.

33

మైదానములో ఏవనగా ఎష్తాయోలు జొర్యా అష్నా

34

జానోహ ఏన్గన్నీము తప్పూయ ఏనాము

35

యర్మూతు అదుల్లాము శోకో అజేకా

36

షరాయిము అదీతాయిము గెదేరా గెదెరోతాయిము అనునవి. వాటి పల్లెలు పోగా పదు నాలుగు పట్టణములు.

37

సెనాను హదాషా మిగ్దోల్గాదు

38

దిలాను మిస్పే యొక్తయేలు

39

లాకీషు బొస్కతు ఎగ్లోను

40

కబ్బోను లహ్మాసు కిత్లిషు గెదెరోతు

41

బేత్దాగోను నయమా మక్కేదా అనునవి, వాటి పల్లెలు పోగా పదియారు పట్టణములు.

42

లిబ్నా ఎతెరు ఆషాను యిప్తా అష్నా నెసీబు

43

కెయీలా అక్జీబు మారేషా అనునవి,

44

వాటి పల్లెలు పోగా తొమ్మిది పట్టణములు. ఎక్రోను దాని గ్రామములును పల్లెలును,

45

ఎక్రోను మొదలుకొని సముద్రమువరకు అష్డోదు ప్రాంత మంతయు,

46

దాని పట్టణములును గ్రామములును, ఐగుప్తు ఏటివరకు పెద్ద సముద్రమువరకును అష్డోదును,

47

గాజాను వాటి ప్రాంతమువరకును వాటి గ్రామములును పల్లెలును,

48

మన్య ప్రదేశమందు షామీరు యత్తీరు

49

శోకో దన్నా కిర్యత్సన్నా

50

అను దెబీరు అనాబు ఎష్టెమో

51

ఆనీము గోషెను హోలోను గిలో అనునవి,

52

వాటి గ్రామములు పోగా పదకొండు పట్టణములు.

53

ఆరాబు దూమా ఎషాను

54

యానీము బేత్తపూయ అఫెకా హుమ్తా కిర్యతర్బా అను హెబ్రోను సీయోరు అనునవి, వాటి పల్లెలు పోగా తొమ్మిది పట్టణములు.

55

మాయోను కర్మెలు జీఫు యుట్ట యెజ్రెయేలు

56

యొక్దెయాము జానోహ

57

కయీను గిబియా తిమ్నా అనునవి, వాటి పల్లెలు పోగా పది పట్టణములు.

58

హల్హూలు బేత్సూరు గెదోరు మారాతు

59

బేతనోతు ఎల్తెకోననునవి, వాటి పల్లెలు పోగా ఆరు పట్టణములు.

60

కిర్యత్యారీ మనగా కిర్యత్బయలు రబ్బా అనునవి, వాటి పల్లెలు పోగా రెండు పట్టణములు.

61

అరణ్యమున బేతరాబా మిద్దీను సెకాకా నిబ్షాను యీల్మెలహు ఎన్గెదీ అనునవి,

62

వాటి పల్లెలు పోగా ఆరు పట్టణములు.

63

యెరూషలేములో నివసించిన యెబూసీయులను యూదా వంశస్థులు తోలివేయ లేకపోయిరి గనుక యెబూసీయులు నేటివరకు యెరూషలేములో యూదా వంశస్థులయొద్ద నివసించుచున్నారు.

మైదానపు
జెకర్యా 7:7

యెరూషలేములోను దాని చుట్టును పట్టణములలోను దక్షిణదేశములోను మైదానములోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్నకాలమున పూర్వికులగు ప్రవక్తలద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనస్సునకు తెచ్చుకొనకుండవచ్చునా?

ధూపద్రవ్య ములను
లేవీయకాండము 1:1-7
1

యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములోనుండి అతనికీలాగు సెలవిచ్చెను.

2

–నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించునప్పుడు, గోవులమందలోనుండి గాని గొఱ్ఱల మందలోనుండి గాని మేకలమందలోనుండి గాని దానిని తీసికొని రావలెను.

3

అతడు దహనబలిరూపముగా అర్పించునది గోవులలోనిదైనయెడల నిర్దోషమైన మగదానిని తీసికొనిరావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు దానిని తీసికొనిరావలెను.

4

అతడు దహనబలిగా అర్పించు పశువు తలమీద తన చెయ్యినుంచవలెను; అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును.

5

అతడు యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారము ఎదుటనున్న బలిపీఠముచుట్టు ఆ రక్తమును ప్రోక్షింపవలెను.

6

అప్పుడతడు దహనబలిరూపమైన ఆ పశుచర్మమును ఒలిచి, దాని అవయవములను విడదీసిన తరువాత

7

యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠము మీద అగ్నియుంచి ఆ అగ్నిమీద కట్టెలను చక్కగా పేర్చవలెను.

ఎజ్రా 3:3-6
3

వారు దేశమందు కాపురస్థులైనవారికి భయపడుచు, ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమున నిలిపి, దానిమీద ఉదయమునను అస్తమయమునను యెహోవాకు దహనబలులు అర్పించుచు వచ్చిరి

4

మరియు గ్రంథమునుబట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి,ఏ దినమునకు నియమింపబడిన లెక్కచొప్పున ఆ దినపు దహనబలిని విధి చొప్పున అర్పింపసాగిరి.

5

తరువాత నిత్యమైన దహనబలిని, అమావాస్యలకును యెహోవాయొక్క నియామకమైన పండుగలకును ప్రతిష్ఠితమైన దహనబలులను, ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛార్పణలను అర్పించుచు వచ్చిరి.

6

ఏడవ నెల మొదటి దినమునుండి యెహోవాకు దహనబలులు అర్పింప మొదలుపెట్టిరి. అయితే యెహోవా మందిరము యొక్క పునాది అప్పటికి ఇంకను వేయబడలేదు.

ఎజ్రా 3:11-6
బలులను
యిర్మీయా 33:11

సంతోష స్వరమును ఆనంద శబ్దమును పెండ్లి కుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమునుయెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతర ముండును, సైన్యములకధిపతియగు యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరల వినబడును; యెహోవా మందిరములోనికి స్తుతి యాగములను తీసికొని వచ్చువారి స్వరమును మరల వినబడును; మునుపటివలె ఉండుటకై చెరలోనున్న యీ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు

కీర్తనల గ్రంథము 107:22

వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక.

కీర్తనల గ్రంథము 116:17

నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించెదను, యెహోవా నామమున ప్రార్థనచేసెదను

హెబ్రీయులకు 13:15

కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.

1 పేతురు 2:5

యేసుక్రీస్తుద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధయాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలెనుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.

1 పేతురు 2:9

అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసవ

1 పేతురు 2:10

ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి.

ప్రకటన 1:5

నమ్మకమైన సాక్షియు, మృతులలోనుండి ఆది సంభూతుడుగా లేచినవాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు, కృపాసమాధానములు మీకు కలుగునుగాక.