ఆకాశమువైపు కన్ను లెత్తుడి క్రింద భూమిని చూడుడి అంతరిక్షము పొగవలె అంతర్ధానమగును భూమి వస్త్రమువలె పాతగిలిపోవును అందలి నివాసులు అటువలె చనిపోవుదురు నా రక్షణ నిత్య ముండును నా నీతి కొట్టివేయ బడదు .
నీతి అనుసరించువారలారా , నా మాట వినుడి నా బోధను హృదయమందుంచుకొన్న జనులారా , ఆలకించుడి మనుష్యులు పెట్టు నిందకు భయ పడకుడి వారి దూషణ మాటలకు దిగులు పడకుడి .
వస్త్రమును కొరికివేయునట్లు చిమ్మట వారిని కొరికివేయును బొద్దీక గొఱ్ఱెబొచ్చును కొరికివేయునట్లు వారిని కొరికివేయును అయితే నా నీతి నిత్యము నిలుచును నా రక్షణ తర తరములుండును .
మురిగి క్షీణించుచున్న వానిచుట్టు చిమ్మటకొట్టిన వస్త్రమువంటివానిచుట్టు గిఱిగీసి వానిని కనిపెట్టుచున్నావు.
దోషములనుబట్టి నీవు మనుష్యులను గద్దింపులతో శిక్షించునప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రమువలె నీవు వారి అందము చెడగొట్టెదవు నరులందరు వట్టి ఊపిరివంటివారు. (సెలా.)
అవి నశించును గాని నీవు నిలచియుందువు అవియన్నియు వస్త్రమువలె పాతగిలును ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు అవి మార్చబడును .
అవి నశించును గాని నీవు నిలిచియుందువు అవన్నియు వస్త్రమువలె పాతగిలును
ఉత్తరీయమువలె వాటిని మడిచివేతువు అవి వస్త్రమువలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే యున్నావు నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు.