
ఆయనను చూడలేనని నీవు చెప్పినను వ్యాజ్యెము ఆయనయెదుటనే యున్నది, ఆయన నిమిత్తము నీవు కనిపెట్టవలెను.
ఆయన కోపముతో దండింపకపోయినందునను నిశ్చయముగా దురహంకారమును ఆయన గుర్తింపక పోయినందునను
యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము నీ కృపనుబట్టి నన్ను రక్షించుము.
మరణమైనవారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు?
సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేనియెడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము
భీతిచెందినవాడనై నీకు కనబడకుండ నేను నాశనమైతిననుకొంటిని అయినను నీకు నేను మొఱ్ఱపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని నాలకించితివి.
మరణమునుండి నా ప్రాణమును కన్నీళ్లు విడువకుండ నా కన్నులను జారిపడకుండ నాపాదములను నీవు తప్పించియున్నావు.
సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును.
బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; వారిపేరు మరువబడియున్నది, వారికిక ఏ లాభమును కలుగదు.
వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందును వారికిక నెప్పటికిని వంతు లేదు.