తలక్రిందుచేసిన(మీరెంత మూర్ఖులు)
యెషయా 24:1

ఆలకించుడి యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు ఆయన దాని పాడుగాచేసి కల్లోలపరచుచున్నాడు దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు.

అపొస్తలుల కార్యములు 17:6

అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారులయొద్దకు ఈడ్చుకొనిపోయి –భూలోకమును తలక్రిందుచేసిన వీరు ఇక్కడికి కూడ వచ్చియున్నారు; యాసోను

వీరిని చేర్చుకొనియున్నాడు.
కుమ్మరికిని మంటికిని
యెషయా 45:9

మంటికుండ పెంకులలో ఒక పెంకై యుండి తన్ను సృజించినవానితో వాదించువానికి శ్రమ. జిగటమన్ను దాని రూపించువానితో నీవేమి చేయుచున్నావని అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా?

యెషయా 45:10

నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ.

యిర్మీయా 18:1-10
1

యెహోవాయొద్దనుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు

2

నీవు లేచి కుమ్మరి యింటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును.

3

నేను కుమ్మరి యింటికి వెళ్లగా వాడు తన సారెమీద పని చేయుచుండెను.

4

కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరల తీసికొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరియొక కుండ చేసెను.

5

అంతట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

6

ఇశ్రాయేలువారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? యిదే యెహోవా వాక్కుజిగటమన్ను కుమ్మరిచేతిలొ ఉన్నట్టుగా ఇశ్రాయేలువారలారా, మీరు నా చేతిలో ఉన్నారు.

7

దాని పెల్లగింతుననియు, విరుగగొట్టుదుననియు, నశింపజేయుదుననియు ఏదోయొక జనమును గూర్చి గాని రాజ్యమునుగూర్చి గాని నేను చెప్పి యుండగా

8

ఏ జనమునుగూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనముచేయుట మానినయెడల నేను వారికి చేయ నుద్దేశించిన కీడునుగూర్చి సంతాపపడుదును.

9

మరియు కట్టెదననియు, నాటెదననియు ఒక జనమును గూర్చి గాని రాజ్యమునుగూర్చి గాని నేను చెప్పి యుండగా

10

ఆ జనము నా మాట వినకుండ నా దృష్టికి కీడుచేసినయెడల దానికి చేయదలచిన మేలునుగూర్చి నేను సంతాపపడుదును.

రోమీయులకు 9:19

అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరముమోప నేల అని నీవు నాతో చెప్పుదువు.

రోమీయులకు 9:21

ఒక ముద్ద లోనుండియే యొక ఘటము ఘనత కును ఒకటి ఘనహీనత కును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా ?

రూపింపబడిన వస్తువు
యెషయా 45:11

ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్తయైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రాగలవాటినిగూర్చి నన్నడుగుదురా? నా కుమారులను గూర్చియు నా హస్త కార్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా?

కీర్తనల గ్రంథము 94:8

జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి బుద్ధిహీనులారా, మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు?

కీర్తనల గ్రంథము 94:9

చెవులను కలుగచేసినవాడు వినకుండునా? కంటిని నిర్మించినవాడు కానకుండునా?