బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు.
వారి హృదయములు సంతోషముతో నిండియుండగా వారుమనము పరిహాసము చేయుటకు సమ్సోనును పిలిపించుదము రండని సమ్సోనును బందీ గృహమునుండి పిలువనంపిరి. వారు అతని చూచి గుడి స్తంభముల మధ్యను అతని నిలువబెట్టి పరిహాసముచేయగా
రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబికుడగు గెరా కుమారుడైన షిమీ అనునొకడు అచ్చటనుండి బయలుదేరి వచ్చెను; అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు
జనులందరును బలాఢ్యులందరును దావీదు ఇరు పార్శ్వముల నుండగా రాజైన దావీదుమీదను అతని సేవకులందరిమీదను రాళ్లు రువ్వుచు వచ్చెను.
ఈ షిమీ నరహంతకుడా, దుర్మార్గుడా
ఛీపో, ఛీపో,నీవేలవలెనని నీవు వెళ్లగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించియున్నాడు; నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడియున్నావని చెప్పి రాజును శపింపగా
సెరూయా కుమారుడైన అబీషై ఈ చచ్చిన కుక్క నా యేలినవాడవును రాజవునగు నిన్ను శపింపనేల? నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చెదననెను.
అందుకు రాజు సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వానిని శపింపనియ్యుడు, దావీదును శపింపుమని యెహోవా వానికి సెలవియ్యగా నీవు ఈలాగున నెందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి
అబీషైతోను తన సేవకులందరితోను పలికినదేమనగా నా కడుపున బుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయ చూచుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము? వాని జోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చియున్నాడు గనుక వానిని శపింపనియ్యుడి.
యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో.
అంతట దావీదును అతని వారును మార్గమున వెళ్లిపోయిరి. వారు వెళ్లిపోవుచుండగా షిమీ అతని కెదురుగా కొండప్రక్కను పోవుచు అతని మీదికి రాళ్లు విసరుచు ధూళి యెగరగొట్టుచునుండెను.
రాజును అతనితోకూడనున్న జనులందరును బడలినవారై యొకానొక చోటికి వచ్చి అలసట తీర్చుకొనిరి.
నన్ను ద్వేషించినవానికి కలిగిన నాశనమునుబట్టి నేను సంతోషించినయెడలను అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన యెడలను
నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపుకూడిరి నీచులును నేనెరుగనివారును నా మీదికి కూడివచ్చి మానక నన్ను నిందించిరి.
నిర్హేతుకముగా నాకు శత్రువులైనవారిని నన్నుగూర్చి సంతోషింపనియ్యకుము నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించువారిని కన్ను గీటనియ్యకుము.
నీ దేవుడు ఏమాయెనని నా శత్రువులు దినమెల్ల అడుగుచున్నారు. వారు తమ దూషణలచేత నా యెముకలు విరుచుచున్నారు.
నీ సహోదరుని శ్రమానుభవదినము చూచి నీవు ఆనందమొంద తగదు; యూదావారి నాశనదినమున వారి స్థితినిచూచి నీవు సంతోషింపతగదు;
దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును.
అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.