యథార్థత
సామెతలు 11:5

యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాళముచేయును భక్తిహీనుడు తన భక్తిహీనతచేతనే పడిపోవును.

సామెతలు 13:6

యథార్థవర్తనునికి నీతియే రక్షకము భక్తిహీనత పాపులను చెరిపివేయును.

కీర్తనల గ్రంథము 25:21

నీకొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును గాక.

కీర్తనల గ్రంథము 26:1

యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమియు సందేహపడకుండ యెహోవాయందు నేను నమ్మికయుంచియున్నాను.

యోహాను 7:17

ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనినయెడల, ఆ బోధ దేవునివలన కలిగినదో, లేక నా యంతట నేనే బోధించుచున్నానో, వాడు తెలిసికొనును.

మూర్ఖస్వభావము
సామెతలు 21:7

భక్తిహీనులు న్యాయము చేయనొల్లరు వారు చేయు బలాత్కారము వారిని కొట్టుకొనిపోవును.

సామెతలు 28:18

యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును మూర్ఖప్రవర్తనగలవాడు హఠాత్తుగా పడిపోవును.

ప్రసంగి 7:17

అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరుగవద్దు;నీ కాలమునకు ముందుగా నీవేల చనిపోదువు?

యెషయా 1:28

అతిక్రమము చేయువారును పాపులును నిశ్శేషముగా నాశనమగుదురు యెహోవాను విసర్జించువారు లయమగుదురు.