unto him
ద్వితీయోపదేశకాండమ 33:16

సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠపదార్థములవలన యెహోవా అతని భూమిని దీవించును పొదలోనుండినవాని కటాక్షము యోసేపు తలమీదికి వచ్చును తన సహోదరులలో ప్రఖ్యాతినొందినవాని నడినెత్తి మీదికి అది వచ్చును.

మోషే
ఆదికాండము 22:1

ఆ సంగతులు జరిగినతరువాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన–అబ్రాహామా, అని పిలువగా అతడు–చిత్తము ప్రభువా అనెను.

ఆదికాండము 22:11

యెహోవా దూత పరలోకమునుండి–అబ్రాహామా అబ్రాహామా అని అతని పిలిచెను; అందుకతడు–చిత్తము ప్రభువా అనెను.

ఆదికాండము 46:2

అప్పుడు రాత్రి దర్శనములయందు దేవుడు–యాకోబూ యాకోబూ అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు–చిత్తము ప్రభువా అనెను.

1 సమూయేలు 3:4

యెహోవా సమూయేలును పిలిచెను . అతడుచిత్తమండి నేనున్నానని చెప్పి

1 సమూయేలు 3:6

యెహోవా మరల సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి -చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితిననెను . అయితే అతడు నా కుమారుడా , నేను నిన్ను పిలువ లేదు , పోయి పండుకొమ్మ నెను .

1 సమూయేలు 3:8

యెహోవా మూడవ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి -చిత్తము నీవు నన్ను పిలిచితివే ; యిదిగో వచ్చితిననగా , ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచెనని గ్రహించి

1 సమూయేలు 3:10

తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా-సమూయేలూ సమూయేలూ , అని పిలువగా సమూయేలు -నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ యిమ్మనెను .

కీర్తనల గ్రంథము 62:11

బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను రెండు మారులు ఆ మాట నాకు వినబడెను.

అపొస్తలుల కార్యములు 9:4

అప్పుడతడు నేలమీదపడి సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను.

అపొస్తలుల కార్యములు 10:3

పగలు ఇంచుమించు మూడు గంటలవేళ దేవుని దూత అతనియొద్దకు వచ్చి–కొర్నేలీ, అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను.

అపొస్తలుల కార్యములు 10:13

అప్పుడు–పేతురూ, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దమతనికి వినబడెను.