తిరగటినైనను తిరగటిమీద దిమ్మనైనను తాకట్టు పట్టకూడదు. అది ఒకని జీవనాధారమును తాకట్టు పట్టినట్లే.
నీ పొరుగువానికి ఏదైనను నీవు ఎరువిచ్చినయెడల అతనియొద్ద తాకట్టు వస్తువు తీసికొనుటకు అతని యింటికి వెళ్లకూడదు
నీవు బయట నిలువవలెను. నీవు ఎరువిచ్చిన వాడు బయటనున్న నీయొద్దకు ఆ తాకట్టు వస్తువును తెచ్చియిచ్చును.
ఆ మనుష్యుడు బీదవాడైనయెడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్టను వేసికొని పండుకొని నిన్ను దీవించునట్లు సూర్యుడు అస్తమించునప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరల అప్పగింపవలెను.
అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతియగును.
ఏమియు ఇయ్యకయే నీ సోదరులయొద్ద నీవు తాకట్టు పుచ్చుకొంటివి వస్త్రహీనుల బట్టలను తీసికొంటివి
తండ్రిలేనివారి గాడిదను తోలివేయుదురు విధవరాలి యెద్దును తాకట్టుగా తీసికొందురు
తండ్రిలేని పిల్లను రొమ్మునుండి లాగువారు కలరు వారు దరిద్రులయొద్ద తాకట్టు పుచ్చుకొందురు
అన్యునికొరకు పూటబడినవాని వస్త్రమును పుచ్చుకొనుము పరులకొరకు వానినే కుదువపెట్టించుము
చెల్లించుటకు నీయొద్ద ఏమియు లేకపోగా వాడు నీ క్రిందనుండి నీ పరుపు తీసికొనిపోనేల?
ఎవనినైనను భాదపెట్ట కయు ఋణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలాత్కారముచేత ఎవనికైనను నష్టము కలుగజేయకయునుండు వాడై, ఆకలిగలవానికి ఆహార మిచ్చి దిగంబరికి బట్ట యిచ్చి
ఎవనినైనను బాధ పెట్టకయు , తాకట్టు ఉంచు కొనకయు , బలాత్కారముచేత నష్ట పరచకయు , ఆకలిగలవానికి ఆహార మిచ్చి దిగంబరికి బట్ట యిచ్చి
కుదువసొమ్మును మరల అప్పగించుచు , తాను దొంగిలినదానిని మరల ఇచ్చివేసి పాపము జరిగిం పక యుండి, జీవాధారములగు కట్టడలను అనుసరించినయెడల అతడు మరణము నొందక అవశ్యముగా బ్రదుకును .
తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరచుకొని బలిపీఠము లన్నిటి యొద్ద పండుకొందురు. జుల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షారసమును తమ దేవుని మందిరములోనే పానము చేయుదురు.