ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టినయెడల ఆ కంటి హానినిబట్టి వారిని స్వతంత్రునిగా పోనియ్యవలెను.
వాడు తన దాసుని పల్లయినను తన దాసి పల్లయినను ఊడగొట్టినయెడల ఆ పంటి నిమిత్తము వారిని స్వతంత్రులగా పోనియ్యవలెను.
నీవు ఎవనిని కటాక్షింపకూడదు, ప్రాణమునకు ప్రాణము కంటికి కన్ను పంటికి పల్లు చేతికి చెయ్యి కాలికి కాలు మీకు విధి.
దాసుడు వాగ్దండనచేత గుణపడడు తాత్పర్యము తెలిసికొన్నను వాడు లోబడడు
మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు ? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు ? అని అందురు మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు . మీ పనివారిచేత కఠినమైనపని చేయించుదురు
మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరిప్పుడు ఉపవాస ముండరు .
నరుని రక్తమును చిందించువాని రక్తము నరునివలననే చిందింపబడును; ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను.
ఎవడైనను ఒకని చావగొట్టిన యెడల సాక్షుల నోటిమాటవలన ఆ నరహంతకునికి మరణశిక్ష విధింపవలెను. ఒక సాక్షిమాటమీదనే యెవనికిని మరణశిక్ష విధింపకూడదు.
చావతగిన నరహంతకుని ప్రాణముకొరకు మీరు విమోచన ధనమును అంగీకరింపక నిశ్చయముగా వానికి మరణశిక్ష విధింపవలెను.
మరియు ఆశ్రయపురమునకు పారిపోయినవాడు యాజకుడు మృతినొందక మునుపు స్వదేశమందు నివసించునట్లు వానిచేత విమోచన ధనమును అంగీకరింపకూడదు.
మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు; నరహత్య దేశమును అపవిత్రపరచును గదా. దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తమువలననే ప్రాయశ్చిత్తము కలుగును గాని మరి దేనివలనను కలుగదు.
అందుకు యెహోవా అతనితో కాబట్టి యెవడైనను కయీనును చంపినయెడల వానికి ప్రతిదండన యేడంతలు కలుగుననెను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపకయుండునట్లు యెహోవా అతనికి ఒక గురుతు వేసెను.
ఏడంతలు ప్రతి దండన కయీను కోసము, వచ్చిన యెడల లెమెకు కోసము డెబ్బది యేడంతలు వచ్చుననెను.
హత్య విషయములో ప్రతిహత్య చేయువాడు తానే నరహంతకుని చంపవలెను.
నీవు చెడ్డది చేసిన యెడల భయపడుము , వారు ఊరకయే ఖడ్గము ధరింపరు ; కీడు చేయువానిమీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతికారము చేయు దేవుని పరిచారకులు .