స్తుతినొందును
కీర్తనల గ్రంథము 41:13

ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వతకాలమునుండి శాశ్వతకాలమువరకు స్తుతింపబడును గాక. ఆమేన్‌. ఆమేన్‌.

కీర్తనల గ్రంథము 72:18

దేవుడైన యెహోవా ఇశ్రాయేలుయొక్క దేవుడు స్తుతింపబడును గాక ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు.

కీర్తనల గ్రంథము 72:19

ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును గాక. ఆమేన్‌. ఆమేన్‌.

కీర్తనల గ్రంథము 106:48

ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తుతినొందును గాక ప్రజలందరు ఆమేన్‌ అందురుగాక. యెహోవాను స్తుతించుడి.

నెహెమ్యా 9:5

అప్పుడు లేవీయులైన యేషూవ కద్మీయేలు బానీ హషబ్నెయా షేరేబ్యా హోదీయా షెబన్యా పెతహయా అనువారునిలువబడి, నిరంతరము మీకు దేవుడైయున్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఈలాగు స్తోత్రముచేసిరి సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక.

హబక్కూకు 3:17-19
17

అంజూరపు చెట్లు పూయ కుండినను ద్రాక్షచెట్లు ఫలిం పకపోయినను ఒలీవచెట్లు కాపు లేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొఱ్ఱలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను

18

నేను యెహోవాయందు ఆనందించెదను నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతో షించెదను.

19

ప్రభువగు యెహోవాయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడికాళ్లవలె చేయును ఉన్నతస్థలముల మీద ఆయన నన్ను నడవచేయును.

మత్తయి 6:13

మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము.

1 తిమోతికి 1:17

సకల యుగములలో రాజైయుండి, అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయుయుగయుగములు కలుగును గాక. ఆమేన్‌.