పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారాతోను ప్రచురించుట మంచిది.
రండి యెహోవానుగూర్చి ఉత్సాహధ్వని చేయుదము మన రక్షణ దుర్గమునుబట్టి సంతోషగానము చేయుదము
కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము .
యెహోవాను స్తుతించుడి యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి.
ఇశ్రాయేలీయులు తమ్మును పుట్టించినవానినిబట్టి సంతోషించుదురు గాక సీయోను జనులు తమ రాజునుబట్టి ఆనందించుదురు గాక.
నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురు గాక తంబురతోను సితారాతోను ఆయననుగూర్చి గానము చేయుదురు గాక.
అంతట వారు కీర్తన పాడి ఒలీవలకొండకు వెళ్లిరి.
ఒకనినొకడు కీర్తనల తోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువునుగూర్చి పాడుచు కీర్తించుచు,
సంగీతములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు కృపా సహితముగామీ హృదయములలో దేవునిగూర్చి గానము చేయుచు, సమస్తవిధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి.
మీలో ఎవనికైనను శ్రమ సంభవించెనా? అతడు ప్రార్థనచేయవలెను; ఎవనికైనను సంతోషము కలిగెనా? అతడు కీర్తనలు పాడవలెను.