దానీయులు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొనిరి. మోషే మనుమడును గెర్షోను కుమారుడునైన యోనాతాననువాడును వాని కుమారులును ఆ దేశము చెరపట్టబడువరకు దానీయుల గోత్రమునకు యాజకులై యుండిరి.
ఫలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనెజరునుండి అష్డోదునకు తీసికొనివచ్చి
దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచిరి .
నా దేవా, యెహోవా, బలమున కాధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము; నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము; దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించుకొందురుగాక; నీ భక్తులు నీ మేలునుబట్టి సంతోషింతురు గాక.
గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి మహిమగల రాజు ప్రవేశించునట్లు పురాతనమైన తలుపులారా, మిమ్మును లేవనెత్తికొనుడి.
అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను .
దేవుని మందసము పట్టబడినదను సంగతిని, తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలిసికొని ప్రభావము ఇశ్రాయేలీయులలోనుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అను పేరు పెట్టెను.
దేవుని మందసము పట్టబడి పోయినందున ప్రభావము ఇశ్రాయేలీయులలోనుండి చెరపట్టబడి పోయెనని ఆమె చెప్పెను .