Let
కీర్తనల గ్రంథము 6:10

నా శత్రువులందరు సిగ్గుపడి బహుగా అదరుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్లుదురు.

కీర్తనల గ్రంథము 35:4
నా ప్రాణము తీయగోరువారికి సిగ్గును అవమానమును కలుగును గాక నాకు కీడుచేయ నాలోచించువారు వెనుకకు మళ్లింప బడి లజ్జపడుదురు గాక.
కీర్తనల గ్రంథము 35:26
నా అపాయమునుచూచి సంతోషించువారందరు అవ మానము నొందుదురుగాక లజ్జపడుదురు గాక నా మీద అతిశయపడువారు సిగ్గుపడి అపకీర్తిపాలగుదురు గాక
కీర్తనల గ్రంథము 71:13
నా ప్రాణవిరోధులు సిగ్గుపడి నశించుదురు గాక. నాకు కీడుచేయ జూచువారు నిందపాలై మాన భంగము నొందుదురుగాక.
కీర్తనల గ్రంథము 109:29
నా విరోధులు అవమానము ధరించుకొందురు గాక తమ సిగ్గునే నిలువుటంగీవలె కప్పుకొందురు గాక
యెషయా 41:11

నీమీద కోపపడినవారందరు సిగ్గుపడి విస్మయ మొందెదరు నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు

మళ్లింపబడి
యెషయా 28:13
ఆజ్ఞవెంబడి ఆజ్ఞ ఆజ్ఞవెంబడి ఆజ్ఞ సూత్రమువెంబడి సూత్రము సూత్రమువెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును.
యోహాను 18:6

ఆయననేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేలమీద పడిరి.