జ్ఞానములేనివారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు.
సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా-మీరు ఆ యాజ్ఞను ఆలకింపకయు, నా నామమును ఘనపరచునట్లు మనఃపూర్వకముగా దానిని ఆలోచింపకయు ఉండినయెడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును; మీరు దానిని మనస్సునకు తెచ్చుకొనరైతిరిగనుక ఇంతకుమునుపే నేను వాటిని శపించియుంటిని.
ఇందువిషయమై -నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనస్సును ,చూడ లేని కన్నులను , విన లేని చెవులను ఇచ్చియున్నాడని వ్రాయబడియున్నది .
మరియు వారి భోజనము వారికి ఉరిగాను , బోనుగాను , ఆటంకముగాను వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండును గాక.
వారు చూడకుండునట్లు వారి కన్నులకు చీకటి కమ్మును గాక. వారి వీపును ఎల్లప్పుడును వంగి పోవునట్లు చేయుము అని దావీదు చెప్పుచున్నాడు .
కట్టువారు వాక్యమున కవిధేయులై తొట్రిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి.